Telugu News » Rakul Preet Singh: ఫుడ్ బిజినెస్‌లోకి రకుల్ ప్రీత్‌సింగ్.. ప్రత్యేకత ఇదే..!

Rakul Preet Singh: ఫుడ్ బిజినెస్‌లోకి రకుల్ ప్రీత్‌సింగ్.. ప్రత్యేకత ఇదే..!

సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోలు, హీరోయిన్లు సినిమాలతో పాటు వ్యాపార రంగాలపై దృష్టి పెడుతున్నారు. సినిమాల్లో అయితే ఎప్పుడూ ఒకే స్థాయి ఫేమ్ ఉండని పరిస్థితి. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా భవిష్యత్తుపై దృష్టిపెడుతున్నారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు వ్యాపారంలో అడుగుపెడుతున్నారు. ఈ జాబితాల్లో ప్రముఖ నటి రకుల్‌ప్రీత్‌సింగ్(Rakul Preet singh) ఉన్నారు.

by Mano
Rakul Preet Singh: Rakul Preet Singh entered the food business.. this is the special thing..!

ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది రకుల్. అయితే పెళ్లికి ముందు నుంచే ఈ బ్యూటీ హైదరాబాద్, విశాఖ తదితర నగరాల్లో ‘ఎఫ్ 45’(F-45) పేరుతో జిమ్స్(Gyms) నిర్వహిస్తోంది. వెల్‌బీయింగ్ న్యూట్రిషన్, వెల్‌నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లోనూ ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి. అంతేకాదు.. 2019లో న్యూబూ పేరుతో బయోడీగ్రేడబుల్, రీయూజబుల్ డైపర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

తాజాగా రకుల్ ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెడుతోంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ‘ఆరంభం’ పేరుతో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించనుంది. దీనికి ఈనెల 16వ తేదీన ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. ప్రముఖ కిచెన్ ఆపరేటర్ ‘క్యూర్‌ఫుడ్స్’ భాగస్వామ్యంతో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో ప్రత్యేకత విషయానికి వస్తే.. తృణధాన్యాలతో తయారుచేసే వంటకాలు ఈ రెస్టారెంట్‌లో లభిస్తాయి. ఈ రెస్టారెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రకుల్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. రెస్టారెంట్ ప్రారంభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంది. అందరికీ న్యూట్రిషన్ అందించాలన్నదే ఈ రెస్టారెంట్ లక్ష్యమని తెలిపింది. ‘ఆరంభం’లో ఫుడ్ శరీరానికి మాత్రమే కాదని, ఆత్మ(మనసు)కు కూడా అని తెలిపింది.

You may also like

Leave a Comment