Telugu News » Ok Chalo Cab Services: హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో కొత్త క్యాబ్ సర్వీస్..!

Ok Chalo Cab Services: హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో కొత్త క్యాబ్ సర్వీస్..!

ఊబర్, రాపిడో తరహాలోనే 'ఓకే చలో'(OK Chalo App) పోస్టిలియన్ మొబిలిటీ టెక్నాలజీస్ క్యాబ్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. డ్రైవర్ల నుంచి భారీ కమీషన్లు కాకుండా నిర్వాహకులు మ్యాచ్ మేకింగ్ ఫీజుగా రూ.5మాత్రమే వసూలు చేస్తున్నామని తెలిపారు.

by Mano
Ok Chalo Cab Services: Another new cab service available in Hyderabad..!

హైదరాబాద్‌(Hyderabad)లో ఎక్కడికి వెళ్లాలన్నా ఇప్పుడు అన్ని రకాల ప్రయాణ వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. మెట్రో, బస్సులతో పాటు ఊబర్, ర్యాపిడో వంటివి కారు, బైక్ సేవలను అందిస్తున్నాయి. ఈ క్యాబ్ సర్వీసులకు పోటీగా మరో కొత్త అప్లికేషన్  నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. ఊబర్, రాపిడో తరహాలోనే ‘ఓకే చలో'(OK Chalo App) పోస్టిలియన్ మొబిలిటీ టెక్నాలజీస్ క్యాబ్ సర్వీసులు ప్రారంభమయ్యాయి.

Ok Chalo Cab Services: Another new cab service available in Hyderabad..!

ఇప్పటికే 3,500 మంది డ్రైవర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్లు కాకుండా ఐఓఎస్ యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని యాప్ యాజమాన్యం వివరించింది. ఇతర అప్లికేషన్లతో పోలిస్తే ఈ సర్వీస్ ధరలు డ్రైవర్, ప్రయాణికులకు అనుకూలంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇతర సర్వీసుల్లో ఆటో, క్యాబ్ డ్రైవర్ల ద్వారా వచ్చే సొమ్ములో దాదాపు 30శాతం నిర్వాహకులు తీసుకుంటున్నారు.

‘ఓకే చలో’ అప్లికేషన్‌లో మాత్రం ఆ చెల్లింపు చేయాల్సిన పనిలేదని పోస్టిలియన్ మొబిలిటీ టెక్నాలజీస్ డైరెక్టర్ ఓరుగంటి ఉదయభాస్కర్ వెల్లడించారు. అంతేకాదు.. వినియోగదారుల భద్రతతో పాటు వారి ఫోన్ నంబర్‌ను తెలుసుకోకుండా ప్రైవసీని కాపాడుకుంటున్నట్లు చెప్పారు. డ్రైవర్ల నుంచి భారీ కమీషన్లు కాకుండా నిర్వాహకులు మ్యాచ్ మేకింగ్ ఫీజుగా రూ.5మాత్రమే వసూలు చేస్తున్నామని తెలిపారు.

దేశంలో ఇంత తక్కువ ధరకు సేవలు అందించే అప్లికేషన్ మరేదీ లేదని ఓకే చలో యాప్ యజమాని తెలిపారు. ఓకే చలో క్యాబ్ డ్రైవర్ సంక్షేమానికి 10శాతం కేటాయించినట్లు తెలిపారు. వినియోగదారుల భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్‌లో ఈ యాప్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు.

You may also like

Leave a Comment