Telugu News » CM Breakfast Scheme : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఊహించని విధంగా అల్పాహారం పథకం..

CM Breakfast Scheme : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఊహించని విధంగా అల్పాహారం పథకం..

ప్రభుత్వ పాఠశాల్లో (Govt Schools), మంత్రులు, ఎమ్మెల్యేలు (MLA), స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

by Venu

ముఖ్యమంత్రి అల్పాహార పథకం తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాల్లో (Govt Schools), మంత్రులు, ఎమ్మెల్యేలు (MLA), స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు వడ్డించే అల్పాహారాన్ని పరిశీలించిన మంత్రులు వారికి స్వయంగా వడ్డించారు.

రాష్ట్ర వ్యాప్తంగా విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టిన ప్రభుత్వం కొత్తగా గురుకుల పాఠశాలలు, కాలేజీలు ఏర్పాటు చేసింది. సుమారు రూ.7000 కోట్లతో మన ఊరు మనబడి ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం ద్వారా చిన్నారుల కడుపు నింపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అల్పాహార పథకానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్‌ (KCR), ప్రభుత్వం.

ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందనుందని అధికారులు అంటున్నారు. ఇకపోతే రంగారెడ్డి జిల్లా ర్యావిలాల పాఠశాలలో మంత్రి హరీశ్‌రావుతో కలిసి సబితా ఇంద్రారెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. మరోవైపు వెస్ట్​మారేడ్​పల్లిలో బ్రేక్​ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్ విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు.

ఈ పథకం దసరా సెలవుల తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇకపోతే అల్పాహారం పథకంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా పట్టణ ప్రాంతాల్లో పర్యవేక్షణ బాధ్యతలను మున్సిపల్‌ కమిషనర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం.

అల్పాహారంలో ఉన్న మేను పరిశీలిస్తే సోమవారం ఇడ్లీ సాంబరు లేదా గోధుమరవ్వ, మంగళవారం పూరి, ఆలు కుర్మ లేదా టామటా బాత్, బుధవారం ఉప్మా సాంబారు లేదా బియ్యం కిచిడి, గురువారం చిరు ధాన్యాలతో చేసే ఇడ్లీ సాంబరు లేదా పొంగల్ సాంబరు, శుక్రవారం ఉగ్గాని లేదా చిరు ధాన్యాల ఇడ్లీ, శనివారం పొంగల్ సాంబరు లేదా కూరగాయలతో చేసిన పులావ్ అందించేలా ప్లాన్ చేసినట్టుగా అధికారులు వెల్లడించారు.

 

You may also like

Leave a Comment