Telugu News » South Central Railway : దూర ప్రయాణికులకు శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..!

South Central Railway : దూర ప్రయాణికులకు శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..!

తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్రకు వెళ్లే ప్రయాణికుల కోసం కూడా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయన్న దక్షిణ మధ్య రైల్వే జైపూర్‌, షిర్డీ, రామేశ్వరం వంటి ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఈ దసరా సీజన్‌లో దాదాపు 100 సర్వీసులు అదనంగా నడిపేలా చర్యలు తీసుకొన్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

by Venu

దసరా (Dussehra) పండగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లాలనుకొంటున్న ప్రయాణికులకు దక్షిణ మధ్య (South Central Railway) రైల్వే శుభవార్త తెలిపింది. పండగ సీజన్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుందని.. రిజర్వేషన్‌ టికెట్లు కన్‌ఫామ్‌ కాలేదనే టెన్షన్, సాధారణ బోగీల్లో ప్రయాణం కష్టసాధ్యమన్న ఆందోళన అవసరం లేదని పేర్కొంది. ప్రయాణీకుల సౌకర్యార్థం దాదాపు 600 ప్రత్యేక రైళ్లను (special trains) నడుపుతున్నట్లు ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. కాగా సికింద్రాబాద్‌ (Secunderabad).  హైదరాబాద్‌ (Hyderabad) రైల్వే స్టేషన్లు, కాచిగూడ, లింగంపల్లితో సహా ప్రధాన రైల్వే స్టేషన్ల నుండి ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరోవైపు విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంతో సహా వివిధ ప్రాంతాలకు రద్దీని దృష్టిలో ఉంచుకుని దాదాపు 200 ట్రిప్పులు నడిచేలా ప్రత్యేక రైళ్ల షెడ్యూల్‌ ఖరారు చేసినట్టు అధికారులు తెలిపారు.

తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్రకు వెళ్లే ప్రయాణికుల కోసం కూడా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయన్న దక్షిణ మధ్య రైల్వే జైపూర్‌, షిర్డీ, రామేశ్వరం వంటి ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఈ దసరా సీజన్‌లో దాదాపు 100 సర్వీసులు అదనంగా నడిపేలా చర్యలు తీసుకొన్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ సమయంలో నిరంతరం రెగ్యులర్‌ రూట్‌లను పర్యవేక్షించడం జరుగుతుందని, ఏదైనా మార్గంలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు.. సాధారణ రైళ్ల కోచ్‌లను పెంచుతామని, అవసరం అనుకొంటే ప్రత్యక రైళ్ల సంఖ్య పెంచడానికి సిద్దంగా ఉన్నామని సీనియర్‌ రైల్వే అధికారులు చెబుతున్నారు.

You may also like

Leave a Comment