ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్స్(Google Maps)ను నమ్ముకుని చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. కొందరు గూగుల్ మ్యాప్స్ చూపిన దారిలో వెళ్లి తప్పిపోగా.. మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
వీకెండ్ ట్రిప్‌నకు వెళ్లిన స్నేహితులు దారితప్పి మెట్ల దారిపై ప్రమాదకరంగా ఆగింది. ఈ ఘటన తమిళనాడు(Tamilnadu)లోని గడలూర్(Gadaluru)వద్ద చోటుచేసుకుంది. వీకెండ్ ట్రిప్ కోసం వచ్చిన స్నేహితులు మళ్లీ కర్ణాటకకు వెళ్లేందుకు బయల్దేరారు.
అయితే, దగ్గర మార్గాన్ని ఎంచుకునేందుకు గూగుల్ మ్యాప్స్ వాడారు. అది కాస్త కొండలూర్లోని గడలూర్ వద్దకు రాగానే కారు మెట్లపైన చిక్కుకుపోయింది. ఈ ప్రాంతం తమిళనాడు, కేరళ, కర్ణాటక మధ్య ట్రైజంక్షన్ ఉంది. ఈ ప్రాంతం గుండానే చాలా మంది ఊటీకి వెళ్తుంటారు.
కారు మెట్లపై ఇరుక్కున్న తర్వాత స్థానికులు, పోలీసులు ప్రధాన రహదారి చేరేందుకు సాయం చేసి కారును రోడ్డుపైకి తోసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.