Telugu News » Greece: స్వలింగ వివాహాలకు గ్రీన్ సిగ్నల్.. బిల్లును ఆమోదించిన గ్రీస్ పార్లమెంట్..!

Greece: స్వలింగ వివాహాలకు గ్రీన్ సిగ్నల్.. బిల్లును ఆమోదించిన గ్రీస్ పార్లమెంట్..!

స్వలింగ పౌర వివాహాలను అనుమతించే బిల్లును గ్రీస్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. స్వలింగ వివాహాన్ని ఆమోదించిన మొదటి మెజారిటీ ఆర్థోడాక్స్ క్రైస్తవ దేశంగా గ్రీస్ నిలిచింది.

by Mano
Greece: Green signal for same-sex marriages.. Parliament of Greece approved the bill..!

సేమ్ జెండర్ మ్యారేజీ(Same Gender Marriage)ని చట్టబద్ధం చేసిన జాబితాల్లో గ్రీస్ దేశం(Greece Country) వచ్చి చేరింది. స్వలింగ పౌర వివాహాలను అనుమతించే బిల్లును గ్రీస్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇది ఎల్‌జీబీటీ(LGBT) హక్కుల మద్దతుదారులకు చారిత్రాత్మక విజయం అని చెప్పొచ్చు. ఈ బిల్లు ఆమోదంతో వారు గ్రీస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Greece: Green signal for same-sex marriages.. Parliament of Greece approved the bill..!

అయితే, స్వలింగ వివాహాన్ని ఆమోదించిన మొదటి మెజారిటీ ఆర్థోడాక్స్ క్రైస్తవ దేశంగా గ్రీస్ నిలిచింది. యూరోపియన్ యూనియన్‌(European Union)లోని 27 సభ్యదేశాల్లో 15 దేశాలు ఇప్పటికే ఈ వివాహాన్ని చట్టబద్ధం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో దీనికి అనుమతి ఉంది. స్వలింగ జంటలు పెళ్లి చేసుకోవడంతో పాటు పిల్లలను దత్తత తీసుకునే హక్కును ఈ చట్టం కల్పిస్తుంది.

300 స్థానాలున్న పార్లమెంటులో 176మంది సభ్యులు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడంతో ఇది చట్ట రూపం దాల్చింది. ఇక, సంప్రదాయవాద దేశమైన గ్రీస్‌లో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఎవరూ ఊహించలేదు. దశాబ్దాలుగా గ్రీస్‌లోని ఎల్‌జీబీటీ కమ్యూనిటీ వివాహ సమానత్వం కోసం పోరాటం చేస్తోంది. ఫలితంగా ఈ బిల్లుకు ఆమోదం లభించింది.

2008లో ఒక లెస్బియన్, గే జంట చట్టాన్ని ఉల్లంఘించి టిలోస్ అనే చిన్న ద్వీపంలో పెళ్లి చేసుకుంది. కానీ వారి వివాహాలను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. తమ మతాచారాలను ఇతరులపై బలవంతంగా రుద్దే గ్రీస్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్లు ఈ స్వలింగ వివాహ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది బైబిల్‌కు వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment