పాదచారులకు సుప్రీంకోర్టు షాక్ (Supreme Court) ఇచ్చింది.. హైవేలపై నడిచే పాదచారుల భద్రత విషయంలో దాఖలు చేసిన ఓ పిటిషన్ను కొట్టేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిని కోర్టు సమర్థించలేదని స్పష్టం చేసింది. దేశంలో హైవేలు పెరిగాయి.. కానీ మనుషులలో క్రమశిక్షణ పెరగలేదని సుప్రీంకోర్టు హితవు పలికింది.
పాదచారులు (Pedestrians) దేశ వ్యాప్తంగా ఉన్న రహాదారులపై తిరగకూడదని సుప్రీం కోర్టు హితవు పలికింది. హైవేలపై పాదచారుల భద్రత అంశాన్ని లేవనెత్తుతూ దాఖలైన పిటిషన్ను స్వీకరించేందుకు నిరాకరించింది. హైవేలను వాహనాల రాకపోకల కోసం ఏర్పరిచినట్టు వెల్లడించిన సుప్రీంకోర్టు.. పాదచారులకు క్షమశిక్షణ అవసరమని పేర్కొంది.
కాగా తొలుత గుజరాత్ (Gujarat) హైకోర్టును ఈ అంశంపై పిటిషనర్లు ఆశ్రయించారు. అయితే, ఆ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖను సంప్రదించాలని సూచించింది. దీంతో గుజరాత్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని పరిశీలించి పలు సూచనలు చేసింది..