భూతల స్వర్గంగా పిలిచే కశ్మీర్‌కు పర్యాటకులు ఎక్కువగా మంచు కొండల మధ్య సరదాగా గడిపేందుకు వెళ్తుంటారు. అయితే, కశ్మీర్(Kashmir)లో ఒకప్పుడు పూర్తిగా మంచు(Snow)తో కప్పబడి ఉండే ఓ ప్రాంతం ఇప్పుడు వెలవెలబోతోంది.
కశ్మీర్లో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే ప్రాంతాల్లో గుల్మార్గ్ ఒకటి. అయితే ప్రస్తుతం ఇక్కడ అసలు మంచు జాడలే కనుమరుగయ్యాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది మంచు కురవడం లేదని నిపుణులు అంటున్నారు. పసిఫిక్ సముద్రంలో వేడి వాతావరణం వల్ల కూడా ఇలా జరుగుతున్నట్లు భావిస్తున్నారు.
స్నో ఫాల్ లేకపోవడం వల్ల నీటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. శీతాకాలంలోనూ మంచు కురవకపోవడం స్థానికులతో పాటు యాత్రకులను కలవరపెడుతోంది. జనవరి 8వ తేదీ వరకు ఈ ప్రాంతంలో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది.
డిసెంబర్లో సుమారు 79 శాతం వర్షపాతం తక్కువ నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో స్కీయింగ్ పర్యాటకులకు కూడా గడ్డుకాలమే ఎదురవుతోంది. గుల్మార్గ్ లాంటి ప్రాంతాల్లో భవిష్యత్తులో మరింత కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.