Telugu News » Hajj 2024: భారత్‌కు సేవ చేయడానికి మేమెప్పుడూ సిద్ధమే: సౌదీ అరేబియా మంత్రి

Hajj 2024: భారత్‌కు సేవ చేయడానికి మేమెప్పుడూ సిద్ధమే: సౌదీ అరేబియా మంత్రి

భారత పర్యటనలో ఉన్న సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్-రబియా మంగళవారం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కలిశారు. ఈ సందర్భంగా యాత్రికుల కోసం హజ్ ప్రక్రియను సులభతరం చేయడంపై కీలక ఒప్పందాలు చేశారు.

by Mano
Hajj 2024: We are always ready to serve India: Saudi Arabia Minister

ముస్లింలు జీవితకాలంలో ఒక్కసారైనా హజ్(Hajj) యాత్రకు వెళ్లాలని, మక్కా(Makka)ను సందర్శించాలని కోరుకుంటారు. అయితే హజ్ యాత్ర ఇకపై సులభతరం కానుంది. ఈ మేరకు భారత పర్యటనలో ఉన్న సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్-రబియా మంగళవారం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కలిశారు. ఈ సందర్భంగా యాత్రికుల కోసం హజ్ ప్రక్రియను సులభతరం చేయడంపై కీలక ఒప్పందాలు చేశారు.

Hajj 2024: We are always ready to serve India: Saudi Arabia Minister

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల వారికి హజ్ యాత్రను అందుబాటులోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అదేవిధంగా సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్-రబియా మాట్లాడుతూ.. హజ్ యాత్రికుల కోసం సౌదీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, భారతీయ యాత్రికులకు సేవ చేయడానికి సౌదీ సిద్ధంగా ఉందని వెల్లడించారు. యాత్రికులకు కావాల్సిన సౌకర్యాలన్నింటినీ కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.

ప్రతీ సంవత్సరం భారత్‌ నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు హజ్ కోసం సౌదీ అరేబియా వెళతారు. మహిళలు మహర్మ్ లేకుండా హజ్ చేయవచ్చు. హజ్ లేదా ఉమ్రా చేసే మహిళా యాత్రికుల కోసం గత సంవత్సరం సౌదీ కీలక ప్రకటన చేసింది. మహ్రమ్ లేకుండా మహిళలు ఇప్పుడు హజ్ కోసం సౌదీకి వెళ్లవచ్చని సౌదీ తెలిపింది. ఈ విషయాన్ని సౌదీ హజ్, ఉమ్రా మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజాన్ ప్రకటించారు.

ఈ మేరకు సెంట్రల్ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా సోమవారం నుంచి హజ్ 2024 కోసం ఆన్‌లైన్ దరఖాస్తును ప్రారంభించింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 20. హజ్ కోసం ప్రయాణించాలనుకునే యాత్రికులు అధికారిక వెబ్‌సైట్ hajcommittee.gov.in నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదీ కాకుండా సెంట్రల్ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ నుంచి ఇతర సమాచారాన్ని పొందవచ్చు.

ఈ ఏడాది భారత్(Bharat) నుంచి హజ్ యాత్రకు వెళ్లిన వారిలో 47 శాతం మంది మహిళలు ఉన్నారు. 2023లో 4000 మందికి పైగా మహిళలు మహర్మ్ లేకుండా హజ్ చేశారు. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద సంఖ్య. హజ్ యాత్రలో సౌదీ అరేబియా ప్రత్యేక సాయాన్ని అందించిందని స్మృతి ఇరానీ తెలిపారు.

You may also like

Leave a Comment