ఉత్తరాఖండ్(Uttarakhand)లోని నైనిటాల్ జిల్లా హల్ద్వానీ(Nainital District Haldwani)లో బంబులురా హింసాత్మక ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి నిందితుల కోసం వెస్ట్రన్ యూపీ(Western UP)లోని కొన్ని జిల్లాల్లో కూడా పోలీసులు దాడులు చేస్తున్నారు. దీంతో పాటు దుండగుల బంధువులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
ప్రధాన నిందితుడు హాజీ అబ్దుల్ మాలిక్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు ఢిల్లీ, యూపీలో నిరంతరం గాలిస్తున్నారు. మొత్తం 10 పోలీసు బృందాలు దుండగుల కోసం వెతుకులాటలో నిమగ్నమై ఉన్నాయి. హల్ద్వానీ హింసాకాండకు సంబంధించిన దర్యాప్తులో రోహింగ్యా సంబంధాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాలిక్ ఢిల్లీలో తలదాచుకుంటున్నట్లు సమాచారం.
కుమాన్ కమిషనర్‌కు గత శనివారం విచారణ బాధ్యతలు అప్పగించారు. 15 రోజుల్లోగా విచారణ నివేదికను అందజేస్తామని వెల్లడించారు. హల్ద్వానీ అల్లర్లలో రోహింగ్యా ముస్లింలు, అక్రమ బంగ్లాదేశ్ వ్యక్తుల పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంబులురాలో దాదాపు 5 వేల మంది రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశీయులు, బయటి వ్యక్తులు నివసిస్తున్నారని వర్గాలు చెబుతున్నాయి.
అల్లర్లకు పాల్పడిన వారు రోహింగ్యా ముస్లిం జనాభా నివసించే బంబుల్‌పురా శివార్లలోని రైల్వే లైన్ చుట్టూ ఉన్న మురికివాడల్లో కొందరు ఉన్నట్లు పోలీసులకు ఇన్పుట్ అందింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హల్ద్వానీ పోలీసులు ఈ అనుమానితుల రికార్డులను ట్రాక్ చేస్తున్నారు. ఫిబ్రవరి 8న హింసాకాండ రాత్రి, చీకటిని ఉపయోగించుకుని, చాలా మంది దుర్మార్గులు హల్ద్వానీని వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్లారు.
వివిధ రాష్ట్రాల్లో సుమారు 10 పోలీసు బృందాలు పరారీలో ఉన్న దుండగుల కోసం వెతుకుతున్నాయి. సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ వీడియో, విచారణ ఆధారంగా పోలీసులు జల్లడి పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన దుండగులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. బంబులురా మినహా ఇతర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు. మరోవైపు సోషల్ మీడియాపై ఓ కన్నేశారు. దుష్ప్రచారాలు చేసే వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు పోలీసులు.