చట్టాలెన్ని వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. రోజూ ఎక్కడో ఒకచోట అత్యాచారం, వేధింపులు, హత్యలు.. ఇలా ఏదో ఒక ఘటన వెలుగుచూస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ (Hyderabd) లో దారుణ ఘటన వెలుగుచూసింది. మహిళ (Lady) ను చంపేసి నిప్పంటించారు. ఇది ఒకరి పనా..? లేక, గ్రూప్ గా జరిగిందా? చనిపోయింది ఎవరు? చంపింది ఎవరు? ఇలా అనేక కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
శంషాబాద్ (Shashabad) పరిధిలోని కిషన్ గూడ సాయి ఎన్‌క్లేవ్ లోని ఇళ్ల మధ్య గురువారం అర్ధరాత్రి దాటాక మంటలు కనిపించాయి. ఖాళీ ప్రదేశంలో అంతకంతకూ పెరుగుతున్న మంటలను చూసి స్థానికులు భయపడ్డారు. దగ్గరకు వెళ్లి చూడగా.. మహిళ మృతదేహం మంటల్లో కాలిపోతోంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్ కు చేరుకున్న ఖాకీలు.. అంతా పరిశీలించారు. అప్పటికే మృతదేహం పూర్తిగా కాలిపోయింది.
కొన్ని ఆధారాలను సేకరించిన పోలీసులు.. స్థానికులను విచారించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. శుక్రవారం ఉదయం క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో గుర్తించటం కష్టంగా మారింది. ఆమె శరీరంపై గాజులు, మెట్టెలు ఉన్నట్లు గుర్తించారు. ఘటనాస్థలాన్ని శంషాబాద్ అడిషనల్ డీసీపీ పరిశీలించారు.
మహిళను హత్య చేసి తగులు పెట్టారా? లేక సజీవ దహనం చేశారా అనేది పోస్టుమార్టం తర్వాత తెలుస్తుందని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఎవరనే వివరాలు సేకరిస్తున్నామని.. మిస్సింగ్ కేసులపై ఫోకస్ పెట్టామని చెప్పారు. అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు.