సిద్దిపేట (Siddipet) మిట్లపల్లిలో (Mittapalli) మహిళా సమాఖ్య భవనం, వయో వృద్ధుల ఆశ్రమాన్ని మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో పాటు బీఆర్ఎస్ (BRS) నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే రాష్ట్ర పురోగతి దెబ్బతింటుందని అన్నారు. పెన్షన్ల దారులకు త్వరలో తీపి కబురు చెప్పనున్నట్టు స్పష్టం చేసిన ఆరోగ్య శాఖ మంత్రి.. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రజల, రైతుల కష్టాలు తీరాయని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
త్వరలో బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు తగించే దిశగా సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్టు పేర్కొన్న హరీష్ రావు.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కాగా అంతకు ముందు సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ భవనం లో రూ.కోటితో చేపట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఇర్కోడ్ గ్రామంలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్ ప్రారంభించారు. వీటితో పాటుగా.. సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్‌లో బీపీ చెకప్ మిషన్‌ను జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్‌తో కలిసి ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. మొత్తానికి ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేతలు దూకుడు పెంచారని చెప్పకనే చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు..