Telugu News » Harish rao: కేసీఆర్ అంటే నమ్మకం.. కాంగ్రెస్ అంటే నాటకం: మంత్రి హరీశ్‌రావు

Harish rao: కేసీఆర్ అంటే నమ్మకం.. కాంగ్రెస్ అంటే నాటకం: మంత్రి హరీశ్‌రావు

‘30 రోజులు మనం అందరం కలిసి కష్టపడితే వచ్చే ఐదేళ్లు సీఎంగా కేసీఆర్, మీ ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రజలకు సేవ చేస్తారని అన్నారు. కేసీఆర్ అంటే నమ్మకం.. కాంగ్రెస్ అంటే నాటకం.. అని విమర్శించారు.

by Mano
Harish Rao: KCR means trust.. Congress means drama: Minister Harish Rao

కేసీఆర్ అంటే నమ్మకమైతే.. కాంగ్రెస్ అంటే నాటకమని మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) విమర్శించారు. రంగారెడ్డి జిల్లా(Rangareddy dist) ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam)లో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ బూత్ కమిటీ సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు.

Harish Rao: KCR means trust.. Congress means drama: Minister Harish Rao

30 రోజులు మనం అందరం కలిసి కష్టపడితే వచ్చే ఐదేళ్లు సీఎంగా కేసీఆర్, మీ ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రజలకు సేవ చేస్తారని అన్నారు. కేసీఆర్ అంటే నమ్మకం.. కాంగ్రెస్ అంటే నాటకం.. అని విమర్శించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేయలేని పనులు కేసీఆర్ చేశారని బీఆర్ఎస్ పథకాలన్నీ సూపర్ హిట్ అన్నారు. మంచి కంటే చెడు వేగంగా వ్యాప్తి చెందుతుందని అందుకే సోషల్ మీడియా వేదికగా కొందరు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

కర్ణాటక రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందన్నారు హరీశ్‌రావు. కేసీఆర్ భరోసా పేరుతో మేనిఫెస్టో జనాల వద్దకు చేర్చాలని సూచించారు. యాసంగి పంటకు రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని వ్యవసాయాన్ని దండగగా మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే సీఎం అంటున్నారని గత ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తే.. ఈడ్చికొడితే ఎక్కడో పడ్డారని ఎద్దేవా చేశారు.

కొంత మంది డబ్బుల కోసం అమ్ముడు పోతే మేము ప్రజల్లో ఉంటాం.. ప్రజలను నమ్ముకుంటామని హరీశ్‌రావు తెలిపారు. మనుషులను కొంటారు కావొచ్చు గానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనలేరని, ఉద్యమం సమయంలో ఒకరు రైఫిల్ పడితే మరొకరు రాజీనామా చేయకుండా పారిపోయారని సెటైర్ వేశారు. ‘అన్ని సర్వేలు బీఆర్ఎస్ వైపే చూపుతున్నాయి.. ఎవరెన్ని ట్రిక్కులు వేసినా హ్యాట్రిక్ కొట్టేది మాత్రం సీఎం కేసీఆరే..’ అని ధీమా వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment