Telugu News » Harish Rao : కాంగ్రెస్ అంటే కలెక్షన్ సెంటర్: హరీశ్ రావు

Harish Rao : కాంగ్రెస్ అంటే కలెక్షన్ సెంటర్: హరీశ్ రావు

ఈ రోజు గజ్వేల్‌కు రైలు రాబోతుందని ఇకపై గజ్వేల్ ప్రజలు ఇకపై రైల్లో కూడా ప్రయాణం చేయొచ్చని హరీశ్ రావు అన్నారు.

by Prasanna

గజ్వేల్ ఒక ప్రయోగ శాలగా మారిందని.. నియోజకవర్గాన్ని ప్రజలు గర్వించే స్థాయికి సీఎం కేసీఆర్ (KCR) తీసుకెళ్లారని మంత్రి హరీశ్‌రావు(Harish Rao) వ్యాఖ్యానించారు. గజ్వేల్ (Gajwel) పట్టణంలో 34 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 100 పడకలతో కూడిన అధునాతన మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు.

Harish

ఈ రోజు గజ్వేల్‌కు రైలు రాబోతుందని ఇకపై గజ్వేల్ ప్రజలు ఇకపై రైల్లో కూడా ప్రయాణం చేయొచ్చని హరీశ్ రావు అన్నారు. గజ్వేల్ పట్టణంలో 100 పడకల నుంచి 350 పడకల ఆస్పత్రి తెచ్చున్నామని, గతంలో ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రం 20 శాతం కూడా ప్రసూతి కేసులుంటే, ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అధికంగా 90 ప్రసూతి కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్.. గతుకుల గజ్వేల్‌ను బతుకుల గజ్వేల్‌గా మార్చారని చెప్పారు.

ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్‌ను తిట్టడం సరైనదేనా? ఈ పార్టీలను ప్రజలు పాతాళంలోకి తొక్కాలన్నారు. గజ్వేల్ లో  పదివేల మందికి గృహలక్ష్మి ఇళ్లు మంజూరయ్యాని, రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయని హరీశ్ రావు చెప్పారు. గజ్వేల్‌లో కేసీఆర్ హాట్రిక్ ఖాయమని, దాంతో గజ్వేల్ మరింత డెవెలప్ అవ్వడం ఎంతో దూరంలో లేదన్నారు.

టీపీసీసీ అంటే…పేమెంట్ కలెక్షన్ సెంటర్‌గా మారి, టిక్కెట్ల అప్లికేషన్లకు లంచం తీసుకునే స్థాయికి కాంగ్రెస్ మారిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కూడా తెలంగాణ అభివృద్దిని ఆపేవే కానీ, ముందుకు తీసుకుని వెళ్లే పార్టీలుకాదన్నారు. తెలంగాణను ఆగం చేసే పార్టీల వెంట నడిస్తే మన బతుకులు కూడా ఆగం అవుతాయిఅని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

 

 

 

 

You may also like

Leave a Comment