ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణా (Telangana) ముందంజలో ఉందని మంత్రి హరీష్ రావు (Harish Rao) అన్నారు. చిన్నకోడూర్ మండలం రమంచ వద్ద నిర్మించిన బీ-ఫార్మసీ (B.Pharmacy) కళాశాలని ప్రారంభించిన సందర్భంలో హరీష్ రావు ఈ కామెంట్స్ చేశారు.
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ, ఐటీ అని మాత్రమే అంటుండేవారు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఐటీతో పాటు ఇతర రంగాలపై దృష్టి పెట్టి…అన్నింటిలోనూ ముందుకు నడిపిస్తున్నారని హరీష్ అన్నారు.
సిద్ధిపేట చదువులకు దేవాలయం వంటిందని, ఇక్కడ ఫార్మసీ కాలేజీ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందిని హరీష్ రావు అన్నారు. తెలంగాణాలోని మారుమూల పల్లెలు కూడా హైదరాబాద్ లాగే అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. కేసీఆర్ అధికారం చేపట్టినప్పటీ నుంచి రాష్ట్రం ఏటా ఒక్కొ మొట్టు ఎక్కుతూ గత తొమ్మిదేళ్లలో ఒక్కొ రాష్ట్రాన్ని దాటుకుంటూ తలసరి ఆదాయంలో దేశంలోనే మొదటి స్థానాన్ని పొందిందని చెప్పారు.
ఇలా తెలంగాణాను దేశంలోనే ముందు నిలబెట్టాలనే బీఆర్ ఎస్ ప్రభుత్వం కష్టపడుతూంటే…కాంగ్రెస్, బీజేపీలు మాత్రం బీఆర్ ఎస్ కు చెడ్డపేరు తేవాలని కష్టపడుతున్నాయని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డి హరీష్ రావు పనితీరుని పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణలో సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధిలో ముందుంటుందని, ఉద్యమం లో కూడా హరీష్ రావు ముందు ఉండే వాడని, ఏ సమస్యైనా ఉద్యమ స్ఫూర్తితో పోరాడతాడని అన్నారు.
రాష్ట్రంలో 9 ఏళ్లలో 1000 గురుకుల పాఠశాల ఏర్పాటు చేసుకున్నామని, తెలంగాణ ఏర్పడ్డాక 1450 గురుకుల జూనియర్ కళాశాలలను ప్రారంభించుకున్నామని సబిత తెలిపారు.