Telugu News » Sorry Boss : బోల్డ్ వెబ్ సిరీస్ బై చెప్పిందటగా…!?

Sorry Boss : బోల్డ్ వెబ్ సిరీస్ బై చెప్పిందటగా…!?

లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) మరికొద్ది రోజుల్లో కొణిదెలవారి కోడలు కాబోతున్నారు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ని పెళ్లాడబోతున్నారు. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది.

by sai krishna

లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) మరికొద్ది రోజుల్లో కొణిదెలవారి కోడలు కాబోతున్నారు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ని పెళ్లాడబోతున్నారు. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది.

అయితే ఈ నేపథ్యంలో ఆమె సినిమాలు తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా మరో వెబ్ సిరీస్ కు కూడా నో చెప్పినట్టు సమాచారం.అయితే కొన్ని నెలల క్రితం కథ నచ్చటంతో ఆమె ఓ వెబ్‌ సిరీస్‌కి ఓకే చెప్పారు.

‘స్కైలాబ్‌(Skylab)’ అనే సినిమాను డైరెక్ట్ చేసిన విశ్వక్‌ ఖండేరావ్‌(Vishvak Khanderao) ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయబోతున్నారు.కథాపరంగా ఇందులో హీరోయిన్ పాత్ర కాస్తంత బోల్డ్‌ గా ఉంటుందని తెలిసింది.

పైగా ఇంటిమేట్‌ సన్నివేశాల్లో కూడా నటించాల్సి ఉంటుందట. అందుకే ఆ వెబ్‌సిరీస్‌ దర్శక, నిర్మాతలను పిలిపించి మరొక హీరోయిన్‌ని చూసుకోమని చెప్పేశారట లావణ్య.

నిశ్చితార్థం అయిన తర్వాత ఇక నేను కొణిదలవారి కోడల్ని. ఇలాంటి కథల్లో నటించడం సబబుకాదని వారికి చెప్పి పంపించేశారట. ఈ విషయం తెలిసిన వారంతా లావణ్య నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.

You may also like

Leave a Comment