సీఎం బయటకు వస్తున్నారంటే పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఆయన షెడ్యూల్‌ను ముందుగానే నిర్ణయిస్తారు. సీఎం వెళ్లే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతకు చర్యలు తీసుకుంటారు. అయితే హర్యానా సీఎం(Haryana CM) మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) మాత్రం ఎలాంటి భద్రతా లేకుండా మారువేషంలో జనం మధ్యలోకి వెళ్లారు.
ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్ ధరించి కాసేపు ప్రజల మధ్యలోనే తిరిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ సమయంలో సీఎం పక్కన ఎలాంటి భద్రతా లేదు. హర్యానాలోని పంచకులలో సెక్టార్-5లో ఉన్న ఓ గ్రౌండ్లో జరిగిన ఒక మేళాలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొన్నారు.
మంగళవారం సాయంత్రం ఒక సాధారణ వ్యక్తిలా కొద్దిసేపు ప్రజల మధ్యలో ఆ మేళా (Haryana Fair)లో తిరిగారు. మేళాలో ఫుడ్‌స్టాల్ వద్ద పాప్‌కార్న్ కొనుగోలు చేసి తిన్నారు. ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి తువ్వాల చుట్టుకుని, క్యాప్ పెట్టుకుని ఆ ప్రాంతమంతా కలియతిరిగారు.
రద్దీగా ఉండే ఆ ప్రాంతం మొత్తం తిరిగి చూశారు.అక్కడ ఉన్న స్థానికులు ఆయన పక్కనే నిలబడి, అటూ ఇటూ తిరుగుతున్నా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను గుర్తుపట్టలేదు. అయితే, సీఎం ఎందుకు అలా మారువేషంలో జనం మధ్యలోకి వెళ్లారన్నది మాత్రం తెలియరాలేదు.
हरियाणा के मुख्यमंत्री मनोहर लाल खट्टर पंचकूला के सेक्टर-5 के दशहरा ग्राउंड में मेला देखने के लिए पहुंचे। यह दावा उनके एक वीडियो को लेकर किया जा रहा है। सीएम इस वीडियो में बिना सिक्योरिटी के मेले में घूमते नजर आ रहे हैं।#ManoharLalKhattar #haryana pic.twitter.com/1Z17xXgdZB
— Parmeet Bidowali (@ParmeetBidowali) November 8, 2023