Telugu News » Health Minister: ‘ప్రజాపాలన’తో 95శాతం మందికి లబ్ధి: మంత్రి దామోదర రాజనర్సింహ

Health Minister: ‘ప్రజాపాలన’తో 95శాతం మందికి లబ్ధి: మంత్రి దామోదర రాజనర్సింహ

మంత్రి(Health Minister) దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha) అన్నారు. సంగారెడ్డి జిల్లా(Sangareddy District)లో ఆయన పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పలు జిల్లాలో నిర్వహించిన పలు అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

by Mano
Health Minister: 95% people benefit from 'democracy': Minister Damodara Rajanarsimha

ప్రజా పాలన కార్యక్రమం ద్వారా 95శాతం మందికి లబ్ధి చేకూరుతుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి(Health Minister) దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha) అన్నారు. సంగారెడ్డి జిల్లా(Sangareddy District)లో ఆయన పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పలు జిల్లాలో నిర్వహించిన పలు అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Health Minister: 95% people benefit from 'democracy': Minister Damodara Rajanarsimha

అందోల్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో అవకాశమిచ్చారని, వారికి కష్ట సుఖాల్లో తోడుంటామని తెలిపారు. డిసెంబరు 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో ప్రజాపరిపాలన సమావేశాలు నిర్వహించి ‘అభయహస్తం’ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు హామీల అమలుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసి ప్రతీ తరానికి సంక్షేమం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అభయహస్తంలో భాగంగా మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు.

వచ్చే నెల 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోలేని వారు ఆ తర్వాత కూడా గ్రామ పంచాయతీలో సమర్పించవచ్చని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ హామీని ఇప్పటికే నెరవేర్చామని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంచామన్నారు. మరో వంద రోజుల్లో అన్ని హామీలు అమలవుతాయని చెప్పారు. ప్రజలు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి కలెక్టర్ శరత్ కుమార్, మెదక్ కలెక్టర్ రాజర్షి షా, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment