Telugu News » Heavy Rains : ప్రకృతి వైపరీత్యాలు వరుస విషాదాలు.. అల్లకల్లోలంలో కాంగో..!!

Heavy Rains : ప్రకృతి వైపరీత్యాలు వరుస విషాదాలు.. అల్లకల్లోలంలో కాంగో..!!

కాంగోలోని దక్షిణ కివు ప్రావిన్స్, కలేహే ప్రాంతంలో కూడా వరదలు రావడంతో కొండ చరియలు విరిగిపడి.. వేలాది ఇల్లు, ఆస్పత్రులు, పాఠశాలలు నీటమునిగాయి. దీంతో ఆ సమయంలో వందలాది మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 170 మంది మరణించినట్టు ఆ సమయంలో అధికారులు వెల్లడించారు.

by Venu
Cyclone: ​​'Michaung' is approaching.. heavy to very heavy rains..!

ప్రకృతి వైపరీత్యాలతో కాంగో దేశం అల్లాడిపోతోంది. ఏకధాటిగా పడుతోన్న వర్షాల కారణంగా ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ, కుండపోత వర్షాల వల్ల వరదలు సంభవిస్తూ.. కొండ చర్యలు విరిగి పడుతుండడంతో ఇల్లు కూలిపోయాయి. వీటి కిందపడి 14 మంది మృతి చెందినట్టు సమాచారం.. కాగా బాధితులందరూ ఇబాండా (Ibanda)లోని బుకావు (Bukavu) నివాసులే అని తెలుస్తోంది.

మరోవైపు కొంతమంది ఈ శిథిలాల కింద ఉన్నట్లుగా సమాచారం. పలువురు బాధితులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. ఆఫ్రికా ఖండం (Continent of Africa)లో, రెండో అతి పెద్ద దేశమైన కాంగో (Congo)ను ఈ వరుస విషాదాలు అతలాకుతలం చేస్తున్నాయి.

ఇలాంటి కుండపోత వర్షాల (Heavy Rains) కారణంగా, కొండ చర్యలు విరిగిపడి 17 మంది మృతి చెందిన ఘటన సెప్టెంబర్ లో చోటు చేసుకోంది. అయితే వాయువ్య కాంగోలోని మంగళ ప్రావిన్స్.. లిస్లే నగరంలోని కాంగో నది ఒడ్డున ఈ ప్రమాదం జరిగిందని, పౌర సమాజ సంస్థ, ఫోర్సెస్ అధ్యక్షుడు మాథ్యూ మోల్ తెలిపారు. మే నెలలో కూడా ఇలాంటి విపత్తే సంభవించిందని వెల్లడించారు.

మరోవైపు కాంగోలోని దక్షిణ కివు ప్రావిన్స్, కలేహే ప్రాంతంలో కూడా వరదలు రావడంతో కొండ చరియలు విరిగిపడి.. వేలాది ఇల్లు, ఆస్పత్రులు, పాఠశాలలు నీటమునిగాయి. దీంతో ఆ సమయంలో వందలాది మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 170 మంది మరణించినట్టు ఆ సమయంలో అధికారులు వెల్లడించారు.

You may also like

Leave a Comment