Telugu News » High Court : ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు

High Court : ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ కు వెళ్లగా.. ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ మంగళవారం విచారణ సందర్భంగా టీఎస్పీఎస్సీపై ఆగ్రహం చేసింది హైకోర్టు.

by admin
High_Court_of_Telangana_in_Hyderabad

గ్రూప్-1 (Group-1) పరీక్ష రద్దు విషయంలో ప్రభుత్వానికి చుక్కెదురైంది. సింగిల్ బెంజ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్ ను కొట్టివేసింది హైకోర్టు. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై సింగిల్ బెంచ్ తీర్పును టీఎస్పీఎస్సీ (TSPSC) సవాల్ చేయగా.. డివిజన్ బెంచ్ విచారణ జరిపి తీర్పునిచ్చింది. గత తీర్పునే సమర్ధిస్తూ మాట్లాడింది. ప్రభుత్వ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

High_Court_of_Telangana_in_Hyderabad

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ కు వెళ్లగా.. ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ మంగళవారం విచారణ సందర్భంగా టీఎస్పీఎస్సీపై ఆగ్రహం చేసింది హైకోర్టు. ఒకసారి పేపర్‌ లీకేజీ, ఇప్పుడేమో బయోమెట్రిక్‌ సమస్య ఉందంటూ.. యువత జీవితాలతో ఆడుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఉద్యోగాలు రాక చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయి ఉండి పరీక్షల నిర్వహణలో పదేపదే టీఎస్పీఎస్సీ (TSPSC) విఫలమవడం ఏంటని ప్రశ్నించింది. గ్రూప్-1 రీ పరీక్షలో బయోమెట్రిక్ పెట్టకపోవడానికి కారణాలేంటో చెప్పాలని అడిగింది. టీఎస్పీఎస్సీ నుండి ఇన్ స్ట్రక్షన్స్ తీసుకోవాలని అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది హైకోర్టు. తర్వాత ఏజీ వాదనలు వినిపించారు.

బయోమెట్రిక్ ఎందుకు పాటించలేదని హైకోర్టు మరోసారి ప్రశ్నించగా.. సాంకేతిక కారణాల వల్లే జరగలేదని వెల్లడించారు. బయోమెట్రిక్ పాటించకపోవడం వల్ల అభ్యర్థులకు నష్టం లేదని.. ఇదొక్కటే కారణంగా చూపించి మొత్తం పరీక్షను రద్దు చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. ఈ మేరకు 2 లక్షల మందికి పైగా అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని అడ్వొకేట్‌ జనరల్‌ ను ఆదేశిస్తూ తదుపరి విచారణను న్యాయమూర్తి ఇవాళ్టికి వాయిదా వేయగా విచారణ కొనసాగింది. సింగిల్ బెంజ్ తీర్పునే సమర్ధిస్తూ ప్రభుత్వ పిటిషన్ ను డిస్మిస్ చేసింది డివిజన్ బెంజ్.

You may also like

Leave a Comment