న్యూ ఇయర్ వేడుకలు(New Year Celebrations) రావటంతో దేశవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలకు జనం పోటెత్తుతున్నారు. వారాంతం సెలవులకు అనుగుణంగా కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో ప్రకృతిని ఆస్వాధించేందుకు జనం బారులుతీరారు. దీంతో హిమాచల్‌లోని పలు ప్రాంతాలు ట్రాఫిక్(traffic jam) సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో ఎలాగైనా ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు ఓ వ్యక్తి చేసిన పనికి తోటి ప్రయాణికులు నోరెళ్లబెట్టారు.
ఏకంగా నదిలో నుంచి కారును నడిపాడు ఆ వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వరుస పండుగలు, వారాంతం కావడంతో మూడు రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌కు పర్యాటకులు పోటెత్తారు. దీంతో లాహౌల్ నుంచి మనాలి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. మనాలి, కాసోల్, సిమ్లా సహా పలు ప్రదేశాల్లోనూ పర్యాటకులు నానా అవస్థలకు గురయ్యారు.
ఈ క్రమంలో లాహౌల్ వ్యాలీలోని చంద్రా నదిలో మహీంద్రా థార్ ఎస్యూవీ (Mahindra Thar SUV) వాహనాన్ని నడిపాడు ఓ వ్యక్తి. ఆ సమయంలో నదిలో పెద్దగా నీటి ప్రవాహం లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే సదరు వ్యక్తి నర్లక్ష్యపు వైఖరికి స్థానికులు మండిపడ్డారు. మరోవైపు, ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరడంతో వారు సదరు వ్యక్తిపై మోటార్ వాహనాల చట్టం-1988 కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు లాహౌల్, కులు, స్పితిలను కలుపుతూ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోహ్‌తంగ్‌లోని అటల్ సొరంగం గుండా మూడు రోజుల్లో 55,000 కంటే ఎక్కువ వాహనాలు సిమ్లాలోకి ప్రవేశించాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ గత 24 గంటల వ్యవధిలో 28,210 వాహనాలు అటల్ సొరంగాన్ని దాటాయి. పొగమంచు కారణంగా భారీగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. పోలీసులు డ్రోన్ సాయంతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
"Outrageous scene near Sissu in Himachal as a tourist brazenly drives into the Chandra river, displaying a shocking disregard for the fragile ecosystem. To all visitors: these areas aren't a playground for your antics! Urgent call to @himachalpolice and the government to crack… pic.twitter.com/406ZGWAwPd
— Nikhil saini (@iNikhilsaini) December 24, 2023