Telugu News » Himachal Pradesh: ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..!

Himachal Pradesh: ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..!

హిమాచల్‌ ప్రదేశ్‌(Himachal Pradesh)లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA)లపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు విధించారు. శాసనసభలో ఆర్థిక బిల్లుపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధిసున్నట్లు తెలిపారు.

by Mano
Himachal Pradesh: Six MLAs disqualified..!

హిమాచల్‌ ప్రదేశ్‌(Himachal Pradesh)లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA)లపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు విధించారు. సిమ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శాసనసభలో ఆర్థిక బిల్లుపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధిసున్నట్లు తెలిపారు. ఇది  తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు.

Himachal Pradesh: Six MLAs disqualified..!

ఎమ్మెల్యేలు రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, ఇందర్ దత్ లఖన్‌పాల్, దేవిందర్ కుమార్ భూటూ, రవి ఠాకూర్, చెతన్య శర్మలను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.స్పీకర్ నిర్ణయం తర్వాత ఈ ఎమ్మెల్యేలందరూ హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల అనర్హతపై బుధవారం స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా తన తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే.

హస్తం పార్టీ గుర్తుపై ఎన్నికైనందున ఈ శాసనసభ్యులు కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించి ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని వెల్లడించారు. క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్‌పై అవిశ్వాస తీర్మానం చేపట్టాలని ఆ రాష్ట్ర గవర్నర్ శివ్‌ ప్రతాప్ శుక్లాను కలిసిన బీజేపీ నేతలు అసెంబ్లీలో బడ్జెట్‌ ఆమోదం పొందకుండా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

సభలో నినాదాలు చేసిన 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను పథానియా సస్పెండ్ చేశారు. అనంతరం వాయిస్ ఓటింగ్ ద్వారా ఆర్థిక బిల్లును సభ ఆమోదించింది. తర్వారా సభను స్పీకర్‌ నిరవధికంగా వాయిదా వేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తర్వాత హిమాచల్ ప్రదేశ్​ అసెంబ్లీ బలం 68 నుంచి 62కి తగ్గింది. మెజారిటీ సంఖ్య కూడా 35 నుంచి 32 తగ్గింది. ప్రస్తుతం 34 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో ఉన్నారు.

You may also like

Leave a Comment