Telugu News » Bharat : హిందూ శక్తితో మా పోరాటం… ఓం మా విశ్వ రూపే శక్తి రూపే విశ్వ స్పూర్తి గురవే నామ:

Bharat : హిందూ శక్తితో మా పోరాటం… ఓం మా విశ్వ రూపే శక్తి రూపే విశ్వ స్పూర్తి గురవే నామ:

హిందూవులు శక్తివంతులైన శాంతమూర్తులు కాబట్టి ఎవరుపడితే వాళ్లు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇలా వాగే వాళ్లకు ఇస్లాం మీదో క్రిస్టియానిటీ మీదో మాట్లాడే దమ్ముందా? అని ప్రశ్నిస్తున్నాయి.

by admin
Rahul Gandhi to launch rural housing scheme in poll-bound Chhattisgarh today

– మొన్న ఉదయనిధి, తర్వాత రాజా, ఇప్పుడు రాహుల్ గాంధీ
– ఈ ఐఎన్డీఐ కూటమి నేతలకు ఏమైంది?
– హిందూవుల మనోభావాలను దెబ్బతీయడమే వీరి పనా?
– హిందూవులు శక్తివంతులైన శాంతమూర్తులు కాబట్టే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారా?
– వీళ్లకు ఇస్లాం మీదో క్రిస్టియానిటీ మీదో మాట్లాడే దమ్ముందా?
– రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై హిందూ సంఘాల ఆగ్రహం

పుట్టింది హిందూ నేలపై.. పీల్చేది హిందూ దేశ గాలినే.. నోట్లోకి వెళ్తున్న నాలుగు మెతుకులు హిందూ గడ్డపై పండినవే. కానీ, హిందూవుల మనోభావాలు దెబ్బతీయడం.. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం.. విపక్ష ఐఎన్డీఐ కూటమి నేతల పనిగా కనిపిస్తోంది. జనం నమ్మడం లేదన్న బాధో, ఓట్లు రావడం లేదన్న ఫ్రస్ట్రేషనో ఏమోగానీ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మరోసారి హిందూ ధర్మంలోని ముఖ్యమైన ‘శక్తి’ పదాన్ని తప్పుగా వాడారు. ఇది హిందూవుల్లో ఆగ్రహావేశాలకు దారితీస్తోంది.

Rahul Gandhi to launch rural housing scheme in poll-bound Chhattisgarh today

రాహుల్ ఏమన్నారంటే..?

భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభ ఆదివారం ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ ‘‘హిందూ మతంలో ‘శక్తి’ అనే పదం ఉంటుంది. మేము శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ప్రశ్న ఏంటంటే, ఆ శక్తి ఏంటి. ఈవీఎంలలో రాజు ఆత్మ ఉంది. ఇది నిజం. దేశంలోని ప్రతీ సంస్థలో ఈడీ, సీబీఐ, ఐటీ డిపార్ట్‌మెంట్లలో రాజు ఆత్మ ఉంది’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలే వివాదానికి దారి తీశాయి. హిందూ ధర్మంలో ‘శక్తి’ అనే పదం చాలా ముఖ్యమైనది. అలాంటి శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం, యుద్ధం చేస్తున్నామని చెప్పడం సమంజసం కాదని హిందూ సంఘాలు అంటున్నాయి. రాజకీయ పరంగా వ్యాఖ్యలు చేయాలంటే హిందూవులతో ముడిపడిన వ్యాఖ్యలు, నమ్మకాలను కించపరిచేలా మాట్లాడడం ఏంటని మండిపడుతున్నాయి.

విపక్ష ఐఎన్డీఐ కూటమి నేతలకు ఇదే పనా?

ఇది హిందూ దేశం. నాలుగు దిక్కుల్లో ఎటు వెళ్లినా హిందూ మూలాలు, నమ్మకాలు కనిపిస్తాయి. కానీ, ఎవరు పడితే వాళ్లు హిందూ ధర్మంపై పడి ఏడుస్తున్నారని ఫైరవుతున్నాయి హిందూ సంఘాలు. రాహుల్ గాంధీయే కాదు, ఇంతకుముందు సనాతన ధర్మం గురించి ఐఎన్డీఐ కూటమి సభ్యుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ నోటికొచ్చింది మాట్లాడరని, సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిందని గుర్తు చేస్తున్నాయి. అలాగే, రాముడి గురించి డీఎంకే నేత రాజా కూడా ఒళ్లు కొవ్వెక్కిన మాటలు మాట్లాడరని చెబుతున్నాయి. ఇప్పుడు ఇదే కూటమిలోని రాహుల్ గాంధీ ‘శక్తి’ పదాన్ని కించపరిచేలా మాట్లాడారని మండిపడుతున్నాయి. హిందూవులు శక్తివంతులైన శాంతమూర్తులు కాబట్టి ఎవరుపడితే వాళ్లు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇలా వాగే వాళ్లకు ఇస్లాం మీదో క్రిస్టియానిటీ మీదో మాట్లాడే దమ్ముందా? అని ప్రశ్నిస్తున్నాయి. రాహుల్ గాంధీకి ఒక్కటే చెబుతున్నామని.. హిందూ ధర్మం ప్రకారం ‘శక్తి’ నశింపజాలదు, సృష్టింపజాలదని సూచిస్తున్నాయి హిందూ సంఘాలు.

మాట మార్చి కవరింగ్

రాహుల్ వ్యాఖ్యలపై వివాదం చెలరేగగా, ప్రధాని మోడీ జగిత్యాల పర్యటన సందర్భంగా స్పందించారు. భార‌త నేల‌పై ఎవ‌రైనా శ‌క్తి వినాశ‌నం గురించి మాట్లాడుతారా, మ‌నం అంద‌రం శ‌క్తిని ఆరాధిస్తామా లేదా అని అడిగారు. యావ‌త్ భార‌త దేశం శ‌క్తిమాత‌ను ఆరాధిస్తుంద‌న్నారు. చంద్ర‌యాన్ విజయవంతాన్ని శ‌క్తిగా గుర్తించామ‌ని, ల్యాండ‌ర్ దిగిన చోటుకు శివ‌ శ‌క్తి అని పేరు పెట్టిన‌ట్లు గుర్తు చేశారు మోడీ. త‌న‌కు ప్ర‌తి త‌ల్లి, కూతురు, సోద‌రి శ‌క్తి రూప‌మే అని అన్నారు. దీంతో రాహుల్ గాంధీ వివరణ ఇచ్చుకున్నారు. తన మాటలను వక్రీకరిస్తున్నారని, మేం ఎవరికి వ్యతిరేకంగానైతే పోరాడుతున్నామో ఆ వ్యక్తే ‘శక్తి’. అది మరెవరో కాదు మోడీ అని అన్నారు. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. రాజకీయాల కోసం హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడతారా? అంటూ నిలదీస్తున్నాయి.

You may also like

Leave a Comment