అమెరికాలో మళ్లీ హిందూ ఆలయం (Hindu temple)పై దాడి జరిగింది. కాలిఫోర్నియాలో ఉన్న గుడి గోడలపై గ్రాఫిటీతో నిరసన వ్యక్తం చేశారు. భారత ప్రధాని మోడీ(PM Modi)కి వ్యతిరేకంగా నినాదాలు రాశారు.
గోడలపై గ్రాఫిటీ రాతలకు చెందిన ఫోటోలను హిందూ అమెరికన్ ఫౌండేషన్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది. నివార్క్ పోలీసులు ఈ ఘటన పట్ల విచారణ చేపడుతున్నారు. ఖలిస్తానీ మద్దతుదారులు భారత్కు వ్యతిరేకంగా గ్రాఫిటీ రాతలు రాశారు. నివార్క్లోని స్వామినారాయణ్ మందిరం గోడలపై ఆ గ్రాఫిటీ వేశారు.
ఈ ఘటన పట్ల సమగ్ర విచారణ చేపడుతామని నివార్క్ పోలీసులు తెలిపారు. ప్రజలను భయపెట్టేందుకు గోడలపై విద్వేషపూరిత రాతలు రాసినట్లు హిందూ అమెరికన్ ఫౌండేషన్ పేర్కొన్నది. నివార్క్ పోలీసుల ఈ ఘటనపై కేసును ఫైల్ చేశారు.
విద్వేష నేరంగా ఈ ఘటనను దర్యాప్తు చేయాలని ఆ ఫౌండేషన్ కోరింది. జీ 20 సదస్సు సమయంలో ఢిల్లీలోని మెట్రో స్టేషన్లపైనా ఖలిస్తానీ అనుకూల రాతలు వెలిశాయి. అమెరికా, కెనడాలో ఇలాంటి విద్వేష నేరాలు తరచూ రికార్డవుతున్నాయి.