అరబ్ దేశాల్లో(Arab countries) తొలి హిందూ దేవాలయం(first Hindu temple) త్వరలో అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. అబుదాబి(Abu Dhabi)లోని అబు మురీఖా వద్ద ఈ భారీ ఆలయం తుదిమెరుగులు దిద్దుకుంటోంది.

ఫిబ్రవరి 13న ఇక్కడి భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగానికి అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా నిలవనుంది. 2015లో ప్రధాని మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా అక్కడి పాలకులు ఈ ఆలయానికి భూమి కేటాయించారు.
1980లో ఇందిరా గాంధీ పర్యటించిన తర్వాత యూఏఈలో పర్యటించిన భారత ప్రధాని మోడీనే. దీంతో 2015 నాటి మోడీ పర్యటన చారిత్రాత్మకంగా నిలిచిపోయింది. మరోవైపు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు మధ్య ప్రాచ్య దేశాల్లో ఇదే మొట్టమొదటి హిందూ దేవాలయం కానుండటం విశేషం. 27 ఎకరాల్లో ఆలయం రూపుదిద్దుకుంటోంది. ఈ ఆలయం బడ్జెట్ సుమారు రూ.700 కోట్లు.