తుఫాన్ (Storm) సమయంలో మనం అల్ప పీడనం (Low Pressure Area), వాయుగుండం (Depression), తుఫాన్, తీవ్ర తుఫాన్ ఇలా పలు మాటలు వింటూ ఉంటాం. మనలో చాలా మంది అల్పపీడనం, వాయు గుండాల ఇతర పదాల గురించి వినడమే కానీ వాటి మధ్య చాలా మందికి తేడా తెలియదు. అసలు అల్పపీడన వ్యవస్థను ఎలా వర్గీకరిస్తారు. వాటిని ఎప్పుడు ఏ పేర్లతో పిలుస్తారనే విషయంపై అవగాహన ఉండదు.
బంగాళ ఖాతం, అరేబియా మహాసముద్రంలో ఏర్పడే గరిష్ట స్థిరమైన గాలి వేగాన్ని ఆధారంగా చేసుకుని అల్పపీడన వ్యవస్థను భారత వాతావరణ శాఖ వర్గీకరిస్తోంది. గాలి వేగాలను బట్టి వాటిని ఒక్కో పేరుతో పిలుస్తుంది. సముద్రంలో గాలుల వేగం 31 కిలో మీటర్ల కంటే తక్కువగా ఉంటే దాన్ని అల్ప పీడనం అని ఐఎండీ పిలుస్తూ ఉంటుంది.
కొన్ని సార్లు తీవ్ర అల్ప పీడనం బలపడి వాయుగుండంగా మారుతుంది. గాలుల వేగం 31 నుంచి 49 కిలో మీటర్ల ఉన్నప్పుడు దాన్ని వాయుగుండం అని పిలుస్తారు. ఆ తర్వాత గాలుల వేగం మరింత పెరిగే దాన్ని తీవ్ర వాయుగుండం అంటారు. గాలుల వేగం 50 నుంచి 61 కిలో మీటర్లు ఉన్నప్పుడు దాన్ని తీవ్ర వాయుగుండం అంటారు. అనంతరం మరింత బలపడి తుఫాన్ గా మారే అవకాశం ఉంటుంది.
గాలుల వేగం 89 నుంచి 117 కిలోమీటర్లు ఉంటే దాన్ని సైక్లోనిక్ తుఫాన్ గా చెబుతారు. గాలి వేగం 168 నుంచి-221 కిలో మీటర్లు ఉంటే దాన్ని అత్యంత తీవ్ర తుఫాన్ అంటారు. ఇక గాలులు గంటకు 222 కిమీ వేగంగా వీస్తు ఉంటే దాన్ని సూపర్ సైక్లోనిక్ తుఫాన్ పిలుస్తారు. సముద్రంలో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో తుపానులు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తుపానుల విషయంలో గందరగోళం ఉండకూడదని తుపాన్లకు పేర్లు పెడుతూ ఉంటారు.