Telugu News » Human Trafficking: భారతీయుల విమానానికి తొలగిన ఆటంకాలు.. 303 మంది సేఫ్..!

Human Trafficking: భారతీయుల విమానానికి తొలగిన ఆటంకాలు.. 303 మంది సేఫ్..!

303మంది భారతీయ ప్రయాణికులున్న విమానాన్ని ఫ్రెంచ్ అధికారులు అధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల నిర్బంధం అనంతరం ఈ విమానం సోమవారం ఉదయం మళ్లీ బయలుదేరనుంది.

by Mano
Human Trafficking: Obstacles removed from Indian flight.. 303 people safe..!

మానవ అక్రమ రవాణా (Human Trafficking) అనుమానంతో 303మంది భారతీయ ప్రయాణికులున్న విమానాన్ని ఫ్రెంచ్ అధికారులు అధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో పురోగతి లభించింది. విమానాన్ని అధీనంలోకి తీసుకున్న వాట్రీ విమానాశ్రయంలోనే న్యాయవిచారణకు ఫ్రాన్స్‌ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నలుగురు న్యాయమూర్తుల ప్యానల్ బహిరంగ విచారణ చేపట్టారు.

Human Trafficking: Obstacles removed from Indian flight.. 303 people safe..!

రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్‌ విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) నుంచి నికరాగువా(Nicaragua)కు బయలుదేరింది. ఇంధనం నింపడం కోసం శుక్రవారం ఫ్రాన్స్‌లోని వాట్రీ ఎయిర్‌పోర్టులో దిగింది. అప్పటికే మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం అందుకున్న ఫ్రాన్స్ అధికారులు ఈ విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

అయితే, ఫ్రాన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్న 303 మంది భారతీయ ప్రయాణికులున్న విమానానికి ఆటంకాలు తొలిగాయి. మూడు రోజుల నిర్బంధం అనంతరం ఈ విమానం సోమవారం ఉదయం మళ్లీ బయలుదేరనుంది. అయితే షెడ్యూల్ ప్రకారం నికరాగువాకు వెళుతుందా? లేదా వెనక్కి మళ్లించి దుబాయికి చేరుతుందా? లేక భారత్ వస్తుందా? అనేది అధికారులు వెల్లడించలేదు.

ఫ్రెంచ్ నిబంధనల ప్రకారం ఈ ఘటనపై విచారణ జరిపిన నలుగురు న్యాయమూర్తుల ప్యానెల్ ఆదివారం న్యాయవిచారణ ప్రారంభించింది. ఓ కంపెనీ క్లయింట్ కోసం విమానాన్ని నడిపామని, మానవ అక్రమ రవాణా అరోపణలతో తమకు సంబంధం లేదని రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్‌కు న్యాయవాది తెలిపారు. అనంతరం విమానం బయలుదేరేందుకు అనుమతులు రావడం వల్ల విచారణ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని జడ్జీలు హియరింగ్‌ను రద్దు చేశారు.

మానవ అక్రమ రవాణా రుజువైతే ఫ్రాన్స్ ప్రభుత్వం ఆ నేరానికి 20 ఏళ్ల క్రిమినల్ జైలుశిక్ష, 30 లక్షల యూరోలు (రూ.27.5 కోట్లు) జరిమానా విధిస్తుంది. ఫ్రాన్స్ చట్టాల ప్రకారం విదేశీయులను ఫ్రెంచ్ సరిహద్దు పోలీసులు 4రోజుల వరకు తమ అధీనంలో ఉంచుకోవచ్చు. జడ్జి అనుమతిస్తే దీన్ని మరో నాలుగు రోజులు పొడిగించవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో గరిష్ఠంగా 26 రోజులకు మించి విదేశీయులను అదుపులో ఉంచుకోకూడదు.

You may also like

Leave a Comment