‘తెలంగాణకు పెద్దపెద్ద కంపెనీలు తీసుకొస్తాం.. వాటితో లక్షల మందికి ఉద్యోగ్యాలు కల్పిస్తాం..’ ప్రభుత్వ పెద్దలు ఎన్నికల సమయంలో చేసిన.. చేస్తున్న వాగ్దానమిది. ఎన్ని ప్రభుత్వాలు మారిన రాష్ట్రం నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభించడంలేదు. ఇందుకు నిదర్శనం.. తాజాగా ఒక్క సాప్ట్వేర్ జాబ్ కోసం వందలాది క్యూకట్టారు. ఇది చూస్తే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది.
ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం(Software job) కోసం వందలాది మంది నిరుద్యోగులు క్యూకట్టడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social media)లో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఒకే ఒక్క పోస్ట్ భర్తీ కోసం అర్హులైన వారిని ఇంటర్వ్యూ(Interview)కు రావాల్సిందిగా ప్రకటన జారీ చేసింది. తక్కువమందే ఇంటర్వ్యూకు వస్తారని కంపెనీ యాజమాన్యం భావించారు. కానీ వారు ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
ఆ సాఫ్ట్వేర్ కంపెనీ యాజమాన్యం అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా వందలాది మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు తరలి వచ్చారు. అక్కడికి చేరుకున్న వారిని కంట్రోల్ చేయడం సెక్యూరిటీ సిబ్బంది నానా తంటాలు పడాల్సి వచ్చింది. అయితే జాతరను తలపించేలా వచ్చిన అభ్యర్థులలో ఒకరు ఇందుకు సంబంధించిన వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిరుద్యోగం ఏ రేంజ్లో ఉందో ఈ వీడియో అద్దం పడుతోందని కొందరు అంటుంటే.. మరికొందరు ‘దేశంలో జనాభాను తగ్గించడం చాలా ముఖ్యం’, ‘ఐటీ రంగంలో అనేక ఉద్యోగాలు సృష్టించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే మరి వాస్తవ పరిస్థితి మరొకలా ఉంది.’ ‘రేయ్.. ఎవర్రా మీరంతా..’ అంటూ సినిమా డైలాగ్స్‌తో ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
Situation of walk-in interviews in India. This is in Hyderabad. pic.twitter.com/DRyz4R4YgM
— Indian Tech & Infra (@IndianTechGuide) November 1, 2023