Telugu News » Supreme Court: సుప్రీం కోర్టు న్యాయవాదిని చంపిన భర్త!

Supreme Court: సుప్రీం కోర్టు న్యాయవాదిని చంపిన భర్త!

నితిన్ తన భార్యను చంపిన తర్వాత సుమారు 36 గంటలపాటు స్టోర్ రూమ్ లోనే దాక్కున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

by Sai
husband killed lawyer at noida home hid in store room for 36 hours cops

ఉత్తరప్రదేశ్(Uttarapradesh) నోయిడా(Noida)లో దారుణం జరిగింది. 61 ఏళ్ల మహిళా న్యాయవాది(Lawyer) భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుప్రీంకోర్టు న్యాయవాది రేణు సిన్హా (Renu sinha)తన భర్త నితిన్ నాథ్ సిన్హాతో కలిసి నోయిడా సెక్టార్ 30లోని బంగ్లాలో నివసిస్తున్నారు.

husband killed lawyer at noida home hid in store room for 36 hours cops

ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ఆమె కనపించకుండా పోయారు. రేణు సోదరుడు ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన సోదరిని ఆమె భర్తే హత్య చేసి ఉంటాడని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.

లాయర్ బంగ్లాలో వెతకగా బాత్ రూమ్ లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె భర్త నితిన్ మాత్రం కనపించలేదు. దీంతో అతడి కోసం గాలించగా ఎక్కడా ఆచూకీ లభించలేదు. చివరికి నితిన్ ఫోన్ నెంబర్ ట్రాక్ చేయగా అది లాయర్ బంగ్లా వద్ద చూపించింది. దీంతో పోలీసులు బంగ్లా మొత్తం వెతకగా స్టోర్ రూమ్ లో కనిపించాడు.

ఈ మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, నితిన్ తన భార్యను చంపిన తర్వాత సుమారు 36 గంటలపాటు స్టోర్ రూమ్ లోనే దాక్కున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. హత్యకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.

You may also like

Leave a Comment