హైదరాబాద్ మెట్రో(Hyd Metro) సంస్థ ప్రయాణికులకు ఓ అలర్ట్(Alert) ప్రకటించింది. నగరంలోని రెండు మెట్రో స్టేషన్లను రెండు గంటలకు పైగా మూసివేయనున్నట్లు ప్రకటించించింది. ప్రధాని నరేంద్ర మోడీ(PM MODI) హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. భద్రత కారణాల దృష్ట్యా రెండు స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది.
సోమవారం సాయంత్రం 4.30 నుంచి సాయంత్రం 6.30గంటల వరకు చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రోస్టేషన్లను రెండు గంటలపాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు అదేవిధంగా ముషీరాబాద్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ప్రధాని మోదీ రోడ్‌షో మొదలవుతుంది.
అనంతరం సనత్‌నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఖైరతాబాద్, నాంపల్లి, కార్వాన్, మలక్ పేట్, బహదూర్‌పురా, మహేశ్వరం, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, చాంద్రాయణగుట్ట, ఎల్బీ నగర్, కూకట్‌పల్లి, ఉప్పల్, మేడ్చల్, అంబర్‌పేట్, శేర్లింగంపల్లి, చార్మినార్, రాజేంద్రనగర్ ఆయా ప్రాంతాల్లో ఉండే మెట్రో స్టేషన్లు 15 నిమిషాల పాటు మూసివేయనున్ననట్లు మెట్రో పేర్కొంది.
ప్రధాని రోడ్ షో సందర్భంగా మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ వెల్లడించారు. ఆయా రూట్లలో ప్రయాణించే ప్రయాణికులు తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకుని మెట్రో సూచించింది. మోడీ రోడ్ షోతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు.