ట్రాఫిక్ నిబంధనలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Hyd Traffic Police) వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలను ప్రధానంగా ఉపయోగిస్తూ పోస్టులు పెట్టడంతో అవి ప్రజలకు తొందరగా చేరువవుతున్నాయి.
ఇటీవల కుమారి ఫుడ్ కోర్టు(Kumari Food Court)కు సంబంధించి పలు వీడియోలు, ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ‘మీది మొత్తం రూ.1000 అయింది.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా..’ అని తన కస్టమర్‌తో చెబుతుండగా తీసిన వీడియో బాగా పాపులర్ అయింది.
ఇప్పుడు అదే మాటలను హైదరాబాద్ సిటీ పోలీసులు ‘ఎక్స్’లో ఆసక్తికరంగా పోస్ట్ చేశారు. రోడ్డుపై సెల్‌ఫోన్ మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా బైక్ నడుపుతున్న ఓ వ్యక్తి ఫోటోను షేర్ చేస్తూ ఆ పోస్ట్ పెట్టారు. దానికి ‘మీది మొత్తం 1000 అయ్యింది.. యూజర్ ఛార్జెస్ ఎక్స్‌ట్రా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ట్రాఫిక్ నియమాలు పాటించండి.. సురక్షితంగా ఇంటికి చేరుకోండి అంటూ పేర్కొన్నారు. దీంతో షాకైన నెటిజన్లు నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఇలా కూడా ఫైన్లు విధిస్తారా? అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసుల ట్వీట్ వైరల్‌గా మారింది.
Midhi motham 1000 ayindhi, user charges extra…#FollowTrafficRules #BeSafe#CellPhoneDriving pic.twitter.com/9kpxRKP8Ov
— Hyderabad City Police (@hydcitypolice) February 20, 2024