హైదరాబాద్(Hyderabad)లో బిర్యానీ అంటే చాలా ఫేమస్. అందులో బావర్చి బిర్యానీ(Bavarchi Biryani) అంటే మరీనూ. హైదరాబాదీలు వారానికి కనీసం మూడు.. నాలుగు సార్లు అయినా బిర్యానీ తింటుంటారు. ఎక్కడ చూసినా రెస్టారెంట్(of restaurants)లలో బిర్యానీ తినే కస్టమర్స్(customers) ఎక్కువగా ఉంటారు. అలాంటి బిర్యానీలో ఇటీవల కొందరి నిర్లక్ష్యంతో బల్లులు, బొద్దింకలు రావడం మనం తరచూ చూస్తున్నాం.
తాజాగా ఎంతో పేరున్న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బావర్చి నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకున్న ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చినంత పనైంది. బిర్యానీ తినేందుకు ఓపెన్ చేసి చూడగా.. ఉడికిన బల్లి రావడంతో షాక్ అయ్యాడు. నేరుగా రెస్టారెంట్‌కు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశాడు.
అయితే, బిర్యానీలో బల్లి రావడంపై రెస్టారెంట్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో కుటుంబ సభ్యులతో కలిసి హోటల్ ముందు ధర్నా చేశారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.