టాలీవుడ్ (Tollywood) సంచలనాలకు కేరాఫ్ గా మారుతోంది. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెండితెర.. తాజాగా మరో మచ్చను మూటగట్టుకొంది.. మైత్రీ మూవీస్ (Mythri Movies) అధినేత ఎర్నేని నవీన్‌పై కిడ్నాప్ కేసు నమోదైంది.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ బ్యానర్‌గా ఎదుగుతున్న సమయంలో ఈయన.. కిడ్నాప్ కు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకొంది..
చెన్నుపాటి వేణు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహరంలో కీలకం వ్యహరించిన రాధాకిషన్‌తో సహా 9 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా నిర్మాత ఎర్నేని నవీన్ పేరును ఎఫ్ఐఆర్ (FIR)లో చేర్చడం సంచలనంగా మారింది.. మరోవైపు ఫిర్యాదు చేసిన వ్యక్తి కొంత మందితో కలిసి గతంలో క్రియా హెల్త్ కేర్‌ను ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో ఆ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న నవీన్, మరికొందరు డైరెక్టర్లతో కలిసి చంద్రశేఖర్ వేగే అనే వ్యక్తితో కలిసి కిడ్నాప్ చేయించారని ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా తన కిడ్నాప్‌లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్, మరికొందరు పోలీసుల ప్రమేయం ఉందని ఆరోపించారు.. వేణు ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు తాజాగా, ఎఫ్ఐఆర్లో మైత్రీ మూవీస్ అధినేత ఎర్నేని నవీన్ పేరును చేర్చారు.