Telugu News » Hyderabad: భాగ్యనగరం ప్రజలకు తీపి కబురు..!

Hyderabad: భాగ్యనగరం ప్రజలకు తీపి కబురు..!

ఈ రేసులో మొత్తం 55 కార్లు పరుగెత్తనున్నాయి. 12.30 కిలోమీటర్లున్న జేవీఆర్‌, 30 కిలోమీటర్లున్న సంఘీ మట్టి ట్రాక్‌లో ఈ ర్యాలీ సాగనుందని నిర్వహకులు తెలుపుతున్నారు. ఈమేరకు తెలంగాణ మాజీ డీజీపీ అనురాగ్‌ శర్మ జెండా ఊపి అధికారికంగా ఈ రేసును శుక్రవారం ప్రారంభించారు.

by Venu

భాగ్యనగరం ప్రజలకు తీపి కబురు.. హైదరాబాద్‌ (Hyderabad)లో మరోసారి ప్రతిష్ఠాత్మక రేసింగ్‌ పోటీలు జరగబోతున్నాయి. మెరుపు వేగంతో, దుమ్ము లేపుతూ.. రయ్‌ రయ్‌మంటూ దూసుకెళ్లే కార్లు ను ప్రత్యక్షంగా చూసే ఛాన్స్ వచ్చింది. నవంబర్ నెల 4,5 తేదీల్లో ఈ రేసులు జరగనున్నాయని రేసింగ్ నిర్వాహకులు వెల్లడించారు.. కాగా నగర శివారులోని సంఘీ స్పిన్నర్స్‌లో (Sanghi Spinners) ఈ ఛాంపియన్‌షిప్‌ నాలుగో రౌండ్‌ కార్ల రేసు శని, ఆదివారాల్లో జరుగనుంది.

 

ఈ రేసులో మొత్తం 55 కార్లు పరుగెత్తనున్నాయి. 12.30 కిలోమీటర్లున్న జేవీఆర్‌, 30 కిలోమీటర్లున్న సంఘీ మట్టి ట్రాక్‌లో ఈ ర్యాలీ సాగనుందని నిర్వహకులు తెలుపుతున్నారు. ఈమేరకు తెలంగాణ మాజీ డీజీపీ అనురాగ్‌ శర్మ జెండా ఊపి అధికారికంగా ఈ రేసును శుక్రవారం ప్రారంభించారు. అయితే సుమారు 17 ఏళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఈ రేసును వీక్షించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కార్ రేసింగ్ (Car Racing) అంటే అభిమానం ఉన్న వారు.

మరోవైపు రెండో సీజన్‌ ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌తో పాటు ఎఫ్‌4 ఛాంపియన్‌షిప్‌ తొలి రౌండ్‌ పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్‌ సిద్దం అవుతుంది. ఇందుకు ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ప్రతిష్ఠాత్మక ఫార్ములా నాలుగో రౌండ్‌ రేసును వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు నిర్వహకులు తెలిపారు..

ఇప్పటికే గత సంవత్సరం హుస్సేన్‌ సాగర్‌ సమీపంలో నిర్వహకులు ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ పోటీని నిర్వహించి.. అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి భాగ్యనగరానికి రేసింగ్‌ కళ వచ్చింది. జాతీయ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌ (National Rally Championship)తో సందడి చేయడానికి సిద్దం అవుతుంది..

You may also like

Leave a Comment