Telugu News » Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అందుబాటులోకి రోబో సేవలు..!

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అందుబాటులోకి రోబో సేవలు..!

జీఎంఆర్ ఇన్నోవెక్స్ పేరుతో 6 నెలల క్రితం ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం రోబోలు, యంత్రాలు, పరికరాలు తయారు చేసేందుకు, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

by Mano
Hyderabad: Robot services available at Shamshabad Airport..!

శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport)లో ప్రయాణికులకు అతిత్వరలోనే రోబో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్‌పోర్టులోకి అడుగుపెట్టినప్పటి నుంచి విమానంలో కూర్చొనేంత వరకూ రోబోలు ప్రయాణికులకు అవసరమైన సేవలు అందించనున్నాయి. పరిశుభ్రతను మరింత మెరుగుపర్చేందుకు రోబోటిక్ టెక్నాలజీ(Robotic Technology)తో పనిచేసే పరికరాలు, యంత్రాలను అందుబాటులోకి తేనున్నారు.

Hyderabad: Robot services available at Shamshabad Airport..!

ఇందుకోసం జీఎంఆర్ ఇన్నోవెక్స్ పేరుతో 6 నెలల క్రితం ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం రోబోలు,
యంత్రాలు, పరికరాలు తయారు చేసేందుకు, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఆవిష్కరణలపై ఐఐటీ-బాంబే, పెప్పర్మెంట్, సైన్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు. కుదుర్చుకున్నారు. రోబోటిక్ ఉత్పత్తులను రూపొందించే అంకుర సంస్థలకూ ప్రోత్సాహం అందించనున్నారు.

నిర్దేశిత ప్రణాళిక ప్రకారం పనులు పూర్తయితే వచ్చే ఏడాది ప్రథమార్ధంలోపు విమానాశ్రయంలో రోబోల సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. విమానాశ్రయ, విమానయాన రంగం కోసం కొత్త రోబోటిక్ ఉత్పత్తుల తయారీ, అభివృద్ధికి విమానాశ్రయ అధికారులు సహకరించనున్నారు. పలు అంకుర సంస్థల ప్రతినిధులు రూపొందిస్తున్న ఆవిష్కరణలను ప్రోత్సహించి, అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తున్నారు.

ఇప్పటికే రోబోటిక్ ప్రయోగశాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం దిల్లీ, బెంగళూరు అంతర్జాతీయ
విమానాశ్రయాల్లో కృత్రిమ మేధతో పనిచేసే రోబోలను ఏర్పాటు చేశారు. అవి ప్రయాణికులకు విమానాల రాకపోకలు, ఎయిర్‌లైన్స్‌ సమాచారాన్ని అందిస్తున్నాయి. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని శాతాన్ని సున్నాకు తగ్గించేందుకు దేశంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా విమానాశ్రయంలో నేలను, మెట్లను, మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు ఇప్పటికే యంత్రాలను వినియోగిస్తున్నారు. ఈ రోబోలతో ప్రయాణికులకు చాలావరకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు సమయం ఆదా అవుతుంది.

You may also like

Leave a Comment