ఉగాది పర్వదినం కొందరి జీవితాల్లో చీకట్లు నింపింది. తెలుగు వారి కొత్త సంవత్సరం ఆనందంగా గడుపుకోకుండా చిరకాలం మరచిపోనీ వేదనను ఆ కుటుంబానికి మిగిల్చింది. పండుగ రోజు వేర్వేరుగా జరిగిన ఘటనల్లో ఇద్దరు మరణించారు.. ఉప్పల్ (Uppal) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్న ప్రమాద వివరాలను చూస్తే..

వారు చికిత్స నిమిత్తం అతనిని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మరణించినట్లు ఎస్సై మధుసూదన్ తెలిపారు.. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించినట్లు వెల్లడించిన ఆయన ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వరంగల్ (Warangal) బస్టాండ్ వద్ద ఉన్న నీళ్ల ట్యాంకును కూల్చి వేస్తుండగా అది ఒక్క సారిగా కుప్పకూలింది. దీంతో ఆ శిధిలాల కిందపడి గరీబ్ నగర్ చెందిన బొంత రవి అనే కూలి మృతి చెందాడు.
కాగా మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన స్వగ్రామం మన బోతుల గడ్డ, ఖానాపూర్ మండలం, నర్సంపేట నియోజకవర్గం అని సమాచారం.. ఇక ప్రమాద ఘటన గురించి తెలుసుకొన్న ఇంతేజార్ గంజ్ (Intejar Ganj) పోలీసులు మృత దేహాన్ని ఎంజీఎం (MGM) మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు..