Telugu News » Hyderabad Woman: ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్ గా హైద్రాబాద్ మహిళ

Hyderabad Woman: ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్ గా హైద్రాబాద్ మహిళ

న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలోని సిడ్నీ నగరానికి చెందిన సౌత్ ఫీల్డ్ పురపాలక సంఘానికి డిప్యూటీ మేయర్ గా ఎన్నికైయ్యారు.

by Prasanna
sandya rani

ప్రపంచం (World) నలుమూలలా భారతీయులు (Indians) లేదా భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నత పదవులు చేపట్టిన వారి లిస్టు రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా ఆ లిస్ట్ లోకి తెలంగాణాకు చెందిన సంధ్యా రెడ్డి (Sandhya Reddy) కూడా చేరారు. హైదరాబాద్ (Hyderabad) కి చెందిన కర్రి సంధ్యా రెడ్డి ఆస్ట్రేలియాలో న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలోని సిడ్నీ నగరానికి చెందిన సౌత్ ఫీల్డ్ పురపాలక సంఘానికి డిప్యూటీ మేయర్ గా ఎన్నికైయ్యారు. అదికూడా ఎలాంటి ఏకగ్రీవంగా ఎన్నికై ఈ ఘనత సాధించారు. ఈ రికార్డు సాధించిన తొలి భారత సంతతి మహిళగా, తొలి తెలుగు మహిళగా ఆమె నిలిచారు.

sandya rani

సంధ్యా రెడ్డి ఉన్నత చదువులన్నీ హైదరాబాద్ లోనే పూర్తిచేశారు. తల్లిదండ్రులు శంకర్ రెడ్డి, సారా రెడ్డి. హైదరాబాద్‌లో స్టాన్లీ కాలేజీలో ఇంటర్‌ పూర్తిచేసిన ఆమె కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాద పట్టా పొందారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తిచేశారు. ఆస్ట్రేలియాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న కర్రి బుచ్చిరెడ్డితో వివాహం జరగడంతో ఆమె ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ నుంచి మైగ్రేషన్ లా పట్టాపొంది, ఇమిగ్రేషన్ న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.

సంధ్యారెడ్డి ప్రయాణం ఇలా…

సంధ్యారెడ్డి మొదటి నుంచి సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. సంధ్యారెడ్డి చొరవ తీసుకుని  స్ట్రాత్ ఫీల్డ్ లోని హోమ్ బుష్ కమ్యూనిటీ సెంటర్లో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2020లో సిటిజన్ ఆఫ్ ది ఇరయర్ అవార్డు కూడా లభించింది. ఈ క్రమంలోనే 2021లో జరిగిన స్ట్రాత్ ఫీల్డ్ స్థానిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి, గెలుపొందారు. తాజాగా స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపాలిటీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యి రికార్డు సృష్టించారు.

You may also like

Leave a Comment