Telugu News » ఇండియా కూటమిలో లుకలుకలు… నితీశ్ వ్యాఖ్యలతో మరోసారి తెరపైకి..!

ఇండియా కూటమిలో లుకలుకలు… నితీశ్ వ్యాఖ్యలతో మరోసారి తెరపైకి..!

విపక్ష ఇండియా కూటమి(Indi alliance)లో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి.

by Ramu
I support journalists Nitish Kumar after INDIA blocs boycott of news anchors

విపక్ష ఇండియా కూటమి(Indi alliance)లో మరోసారి లుకలుకలు బయట పడ్డాయి. తాజాగా 14 మంది యాంకర్లను(Anchors) బాయ్ కాట్(boy cott) చేస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై బిహార్ సీఎం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో కూటమిలో విబేధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కూటమిలో అంతర్గత విభేదాలు వున్నాయని స్పష్టం అవుతోందని అంతా చర్చించుకుంటున్నారు.

I support journalists Nitish Kumar after INDIA blocs boycott of news anchors

14 ఛానెల్స్ యాంకర్ల కార్యక్రమాలను బాయ్ కాట్ చేస్తున్న నిర్ణయం గురించి బిహార్ సీఎం నితీశ్ కుమార్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి ఆయన ఆ నిర్ణయం గురించి తనకు తెలియదన్నారు. తాను మాత్రం జర్నలిస్టులకు మద్దతుగా వుంటానన్నారు. జర్నలిస్టులను తాను ఎందుకు వ్యతిరేకించాలని ఆయన ప్రశ్నించారు.

జర్నలిస్టులకు స్వేచ్చను ఇచ్చినప్పుడే వాళ్లు వాస్తవాలను వెలుగులోకి తీసుకు వచ్చి స్వేచ్చగా వార్తలు రాయగలరన్నారు. జర్నలిస్టులపై నియంత్రణ ఉండాలా అని ఆయన ప్రశ్నించారు. తాము ఏది సరైనదని అని భావిస్తే దాన్ని స్వేచ్చగా రాసే హక్కు జర్నలిస్టులకు ఉందని ఆయన స్పష్టం చేశారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు.

జర్నలిజంలో కొందరు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని కూటమి నేతలు భావించి వుండవచ్చన్నారు. అందుకే అలాంటి నిర్ణయం తీసుకుని వుండవచ్చన్నారు. కానీ తాను మాత్రం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. జర్నలిస్టులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాల్సిందేనన్నారు. అప్పుడే వాళ్లు వార్తలను స్వేచ్చగా రాసేందుకు వీలువుంటుందన్నారు.

You may also like

Leave a Comment