Telugu News » ఇండియా టాపర్, గోల్డ్ మెడలిస్ట్ అయిన స్మితా సబర్వాల్ గారు… ఇన్నిసార్లు దేనిలో ఫెయిల్ అయ్యారో తెలుసా..?

ఇండియా టాపర్, గోల్డ్ మెడలిస్ట్ అయిన స్మితా సబర్వాల్ గారు… ఇన్నిసార్లు దేనిలో ఫెయిల్ అయ్యారో తెలుసా..?

by Sravya

స్మిత సబర్వాల్ అందరికీ పరిచయమే. ఆమె గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. స్మిత సబర్వాల్ ఇంటర్ లో ఐసిఎస్ఈ సిలబస్ లో టాపర్. ఇదేమి అంత ఈజీ కాదు. ఎంతో కష్టపడితే కానీ టాపర్ కాలేరు. కానీ ఈమె ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చారు. స్మిత మొదటి సారి 1999లో సివిల్స్ పరీక్ష రాశారు కానీ ప్రిలిమ్స్ లో ఈమె క్వాలిఫై కాలేదు. అప్పుడు ఆమె ఒక కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యారు. కోచింగ్ తీసుకుని 2001లో రెండవసారి మళ్లీ సివిల్స్ పరీక్ష రాసి, ఈసారి ఏకంగా ఇండియాలో నాలుగవ ర్యాంక్ ని సాధించారు.

ఈమె ఎప్పుడు చదువులో ముందుండేవారు. బాగా మార్కులు వచ్చేవి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది లేదు చిన్నప్పటి నుండి కూడా చదువులో చురుకుగా ఉన్న స్మిత అన్నిట్లో కూడా ఫస్ట్ వచ్చేవారు. కానీ అన్నిట్లో గెలుపుని చూసిన స్మిత ఒకసారి మాత్రం చిన్న ఫెయిల్యూర్ ని చూసింది అది కూడా వరుసగానే. స్మిత ఐదవ తరగతిలో ఉన్నప్పుడు స్థానిక భాషలో ఫెయిల్ అయ్యారు. అది కూడా ఒకసారి కాదు అనేక మార్లు. ఈమె స్థానిక భాష లోనే ఫెయిల్ అవుతుండేవారట. ఐదవ తరగతిలో మాత్రమే ఇలా ఫెయిల్ అవుతూ ఉండేవారట. 2001లో ట్రైనీ కలెక్టర్గా ఐఏఎస్ విధుల్లో చేరారు స్మిత ఆ తర్వాత ఆమె మంచి గుర్తింపుని కూడా తెచ్చుకోవడం జరిగింది. ఫలితంగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం లో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు స్మిత.

Also read:

గ్రాడ్యుయేషన్ విషయానికి వస్తే ఈమె గ్రాడ్యుయేషన్ ని హైదరాబాద్ లో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ లో పూర్తి చేయడం జరిగింది ఎస్ఎస్ వాలంటీర్ బిజినెస్ లా అకౌంటెన్సీ మార్కెట్లో ఈమె డిగ్రీని పూర్తి చేశారు. స్మిత 2001లో అదిలాబాద్ లో ట్రైన్ కలెక్టర్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2003 జూలై 14 నుండి 2004 నవంబర్ 27 వరకు ఈమె అసిస్టెంట్ కలెక్టర్గా చిత్తూరు లో పని చేశారు. 2004 నవంబర్ 28 నుండి 2004 డిసెంబర్ 31 దాకా ఈమె గ్రామీణ అభివృద్ధి శాఖలో ప్రాజెక్టు డైరెక్టర్ గా వున్నారు. ఇలా అనేక పోస్టుల్లో ఈమె వివిధ చోట్ల పని చేసారు.

You may also like

Leave a Comment