Telugu News » Leaflets going viral : కేసీఆర్‌కు మళ్లీ ఓటు వేస్తే 30 లక్షల మందిని చంపేస్తాడు..??

Leaflets going viral : కేసీఆర్‌కు మళ్లీ ఓటు వేస్తే 30 లక్షల మందిని చంపేస్తాడు..??

మీకు రెండు వేల పింఛన్ ఇచ్చి మోసంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయబోమని ఒట్టు వేసుకోండని నిరుద్యోగులు పిలుపునిచ్చారు.

by Venu

ఉద్యమాల కొలిమి నుండి ఊపిరి పోసుకున్న తెలంగాణ.. ప్రాణాలు అర్పించి.. పగలు రాత్రి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. ఆడపిల్లల పసుపు కుంకుమలతో, ఎందరో తల్లుల కడుపు కోతలతో సాధించిన తెలంగాణ.. ఒక కుటుంబం చేతిలో బానిసగా మారి.. వారు పెత్తనం చేస్తుంటే భరిస్తూ.. రాష్ట్ర వనరులను ఇష్టానుసారంగా దోచుకుంటూ, ప్రశ్నించే హక్కులను హరిస్తూ, నిరంకుశంగా పాలిస్తూ, ప్రజల డబ్బులను దుర్వినియోగం చేస్తుంటే మేధావులు మౌనం వహించడం.. తెలంగాణ ఆశయాలను సమాధి చేయడంతో సమానం అని జేఏసీ నేతలు ఆవేదన చెందుతున్నారు.

ఈ ఆవేదన నుంచి పుట్టిన ఆక్రోశంతో బీఆర్ఎస్‌ను (BRS) ఓడించాలంటూ ఇప్పటికే పౌర సమాజ వేదికల (Civil society platforms) జేఏసీ (JAC) పిలుపునివ్వగా తాజాగా ‘తెలంగాణ నిరుద్యోగులు’ (Telangana unemployed) పేరుతో కరపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. కేసీఆర్‌కు మళ్లీ ఓటు వేస్తే 30 లక్షల మంది నిరుద్యోగులకు చంపేస్తాడని, వారి ఉసురు మనకు, మన ఇంట్లో వాళ్లకు తగులుతుందని ఆ కరపత్రంలో పేర్కొన్నారు.

అమ్మా.. నాన్నా… ఆలోచించండి.. మీ కొడుకు, కూతురు ఉద్యోగం చేసుకోవాలా? ఉరి వేసుకోవాలా? ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటే నిర్ణయిస్తుందని కరపత్రంలో ఉంది. మీ పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేసి.. మీకు రెండు వేల పింఛన్ ఇచ్చి మోసంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయబోమని ఒట్టు వేసుకోండని నిరుద్యోగులు పిలుపునిచ్చారు.

తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఇంటికొకరు సావండి.. ఒక్కో శవానికి ఐదు లక్షల ఇస్తానంటున్నాడు.. అందుకే ఓటు వేసే ముందు ఆలోచించండని ఆ కరపత్రంలో కోరారు. ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం 18 సార్లు పరీక్షలను రద్దు చేసిందని ఆ కరపత్రంలో నిరుద్యోగులు గుర్తుచేశారు. పిల్లలు ఉద్యోగం రాలేదని ఉరేసుకొని చనిపోతున్నారని..వారి చావులకు కారణం అవుతున్న కేసీఆర్‌కు ఓటు వేయొద్దని.. పదేండ్లుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వకుండా విద్యార్థుల, నిరుద్యోగుల ప్రాణాలను తీస్తున్నదని ఆ కరపత్రంలో తెలంగాణ నిరుద్యోగులు ఆరోపించారు.

తెలంగాణ సాధించింది ఇందుకోసం కాదని, నమ్మించి గొంతు కోస్తున్న కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని తల్లిదండ్రులను వేడుకుంటున్నట్టు ఆ కరపత్రంలో వెల్లడించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఓడిద్దాం.. తెలంగాణ యువత ప్రాణాలను కాపాడుకుందాం.. అని పిలుపునిచ్చారు. కాగా ప్రస్తుతం ఈ కరపత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

You may also like

Leave a Comment