తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు టీటీడీ(TTD) కీలక సూచన చేసింది. భక్తుల రద్దీ విపరీతంగా ఉన్న నేపథ్యంలో శ్రీవారి(Lord Venkateshwara swami) సర్వ దర్శనానికి 18 గంటల(18 Hours) సమయం పడుతోందని ప్రకటనలో పేర్కొంది. పెళ్లిళ్ల సీజన్, సెలవుల కారణంగా రద్దీ పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 30 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. కొండపైకి వస్తున్న భక్తుల(piligrims) రద్దీ ఇంకా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
గురువారం ఒక్కరోజే శ్రీ వెంకటేశ్వర స్వామిని 65,992 మంది దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. ఇందులో 25,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు పేర్కొంది.ఇదిలాఉండగా భక్తుల తాకిడి వలన శ్రీవారి హుండీ ఆదాయం అమాంతం పెరిగిపోయింది.
నిన్న ఒక్కరోజే 3.53 కోట్లు ఆదాయం టీటీడీకి వచ్చిందని అధికారులు తెలిపారు.మరో వారం రోజుల్లో విద్యార్థులకు పదో తరగతి పరీక్షలు పూర్తవ్వడం, సమ్మర్ హాలీడేస్ వస్తున్న దృష్ట్యా భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.దీనికి తోడు కొండపైన విపరీతమైన రద్దీ కారణంగా రూములు దొరకడం లేదని సమాచారం.వేసవి కాలం కావడంతో కొండపైన వేడివి దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు మార్గమధ్యలో నీళ్లు, మజ్జిగ అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.