Telugu News » Vyommitra: త్వరలో అంతరిక్షంలోకి వ్యోమ మిత్ర!

Vyommitra: త్వరలో అంతరిక్షంలోకి వ్యోమ మిత్ర!

గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఒక మహిళా రోబోను ఇస్రో నింగిలోకి పంపించనుందని..

by Sai
in gaganyan mission female robot vyomamitra will go to space union minister

ఆగస్టు 23 యావత్‌ ప్రపంచ మొత్తం ఇండియా(india) వైపు చూసేలా చేసిన ఘనత ఇస్రోది. ఇప్పటి వరకూ చంద్రుడిపై ఎవరూ కాలు పెట్టని దక్షిణ ధ్రువంపై దిగి ఇస్రో చారిత్రక విజయాన్ని సాధించింది. అతి తక్కువ బడ్జెట్‌తో ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన ఈ విజయం పట్ల అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలు అందుతున్నాయి. ఈ క్రమంలో మరిన్ని ప్రయోగాలకు ఇస్రో ముందడుగు వేస్తోంది.

in gaganyan mission female robot vyomamitra will go to space union minister

ఇందులో భాగంగానే ఇప్పుడు ఇస్రో ముందు ఉన్న మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగం గగన్‌యాన్. అంతరిక్షంలోకి మనుషులను పంపాలనే లక్ష్యంతో చేపడుతున్న ఈ గగన్‌యాన్ ప్రయోగాన్ని అతి త్వరలో ప్రయోగించనున్నట్లు ఇస్రో ఇప్పటికే వెల్లడించింది. ఈ క్రమంలోనే కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్.. గగన్‌యాన్ ప్రయోగం గురించి మరిన్ని వివరాలు తెలిపారు.

గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఒక మహిళా రోబోను ఇస్రో నింగిలోకి పంపించనుందని.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వివరించారు. ఆ మహిళా రోబో పేరు వ్యోమమిత్ర (Vyommitra) అని తెలిపారు. దీనికి సంబంధించిన ట్రయల్స్ అక్టోబరు నెల మొదటి వారం లేదా రెండో వారంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన జీ 20 కాంక్లేవ్‌లో శనివారం పాల్గొన్న జితేంద్ర సింగ్.. ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ క్రమంలోనే గగన్‌యాన్ ప్రయోగాన్ని 2022 ఏడాదిలోనే అంతరిక్షంలోకి పంపించాల్సి ఉన్నా.. కొవిడ్ మహమ్మారి కారణంగా అది ఆలస్యం అయినట్లు తెలిపారు. ఈ గగన్‌యాన్ ప్రయోగంలోని మొదటి ట్రయల్ మిషన్‌ను అక్టోబర్ తొలి వారం లేదా రెండో వారంలో చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే మరిన్ని వ్యాఖ్యలు చేసిన జితేంద్ర సింగ్.. వ్యోమగాములను అంతరిక్షంలోకి సురక్షితంగా పంపించడం ఎంత ముఖ్యమో.. అంతే సురక్షితంగా వారిని తిరిగి మళ్లీ భూమిపైకి తీసుకురావడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ఈ గగన్‌యాన్ రెండో మిషన్‌లో మహిళా రోబో వ్యోమమిత్ర ఉంటుందని ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ వెల్లడించారు.

ఆ వ్యోమమిత్ర.. మనిషి చేసే అన్ని రకాల కార్యకలాపాలను నిర్వహిస్తుందని చెప్పారు. అనుకున్న ప్రకారం.. అన్ని ప్రక్రియలు సజావుగా జరిగితే.. ఈ ప్రయోగం మరింత ముందుకు వెళ్లవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోనే చంద్రయాన్ 3 ప్రయోగం గురించి మాట్లాడిన జితేంద్ర సింగ్.. చంద్రుని దక్షిణ ధ్రువంపైన విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టడం భారత్‌కు అతిపెద్ద విజయాన్ని సాధించిపెట్టిందని తెలిపారు.

ఈ ప్రయోగంలో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలతోపాటు యావత్ భారత దేశమంతా ఎంతో టెన్షన్ పడ్డామని చెప్పారు. చివరికి ఇస్రో పంపిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమై ల్యాండర్ జాబిల్లిపై దిగడంతో తాము ఎంతో సంబరాలు చేసుకున్నట్లు వివరించారు.

You may also like

Leave a Comment