ప్రపంచ కప్ -2023(World Cup-2023) తుది అంకానికి చేరుకుంది. 45 రోజుల ఈ క్రికెట్ పండుగకు టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్‌తో తెరపడనుంది. టైటిల్ పోరులో 19న అహ్మదాబాద్(Ahmadabad) వేదికగా అమీతుమి తేల్చుకోనున్నాయి. విశ్వకప్ విజేతగా నిలిచేందుకు ఇరు జట్లు ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాయి.
ఆతిథ్య భారత్ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. ఆసీస్ ఎనిమిదో సారి ఫైనల్ చేరుకుంది. ఐసీసీ ఈవెంట్ నాకౌట్ మ్యాచుల్లో ఇరుజట్లు ఏడు సార్లు తలపడ్డాయి. అందులో భారత్‌దే పైచేయి. కాగా, ఆసీస్ నమోదు చేసిన మూడు విజయాలను టీమ్ఇండియా ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ మ్యాచ్‌లు అంతలా ప్రభావం చూపాయి.
ఇంతకీ ఆ మ్యాచ్‌లు ఏంటో చూద్దాం.. సరిగ్గా 20 ఏళ్ల కింద, 2003 వరల్డ్కప్ ఫైనల్లో భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆసీస్ భారత్ ముంగిట 360 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో భారత్.. 39.2 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటై, రన్నరప్తో సరిపెట్టుకుంది. 2015లోనూ భారత్‌కు పరాభవం ఎదురైంది. సెమీస్‌లో ఆసీస్‌తో తలపబడినా అనూహ్యంగా ఓడి ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. ఈ ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ భారత్‌కు అస్ట్రేలియాతో పరాభవం తప్పలేదు.
దీంతో ఇదివరకు జరిగిన ఆ మూడు మ్యాచుల్లో భారత్‌ను దెబ్బకొట్టిన ఆసీస్‌పై ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలన్న కసితో టీమ్ఇండియా ఉంది. ఫైనల్‌లో ఆసీస్‌ను ఓడించి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ చీఫ్ రవిశాస్త్రి వంటి సీనియర్లు ఇప్పటి వరకు ఎలా ఆడుతూ వచ్చారో ఫైనల్‌లోనూ అదే ప్రదర్శన ఇవ్వాలని, కొత్తగా ఏమీ చేయొద్దన్నారు. భారత్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.