వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి అనంతరం తొలి టీ20(T20) లో విజయం సాధించిన టీమ్‌ఇండియా అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ ఉంది. వైజాగ్‌లో రికార్డు స్కోరు చేజ్ చేసిన యువ భారత జట్టు నేడు ఆస్ట్రేలియాతో రెండో టీ20లో పోరుకు సిద్ధమైంది. నేడు తిరువనంతపురం (Thiruvananthapuram)లోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం(Greenfield Stadium)లో ఈ మ్యాచ్ జరుగనుంది.
సాయంత్రం 7గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేయడం కష్టం. ఇక్కడ జరిగిన మూడు టీ20 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన టీమ్ బౌలింగ్ వైపే మొగ్గుచూపాయి. యువ భారత జట్టుకు బ్యాటింగ్‌లో జట్టుకు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా బౌలింగ్‌లో మరింత రాణించాలని భారత్ చూస్తోంది. మరోవైపు కంగారూలు ఎలాగైనా సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కేరళపై అధికంగా ఉండటంతో.. మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆకాశం మేఘావృతమై ఉండడంతో ఈ మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి తప్పేలా కనిపించడంలేదు. మొదటి మ్యాచ్ లో టీమిండియా అవలీలగా గెలిచింది. మరి ఈ మ్యాచ్ లో ఎలా ఆడతారో చూడాలి.
భారత్-ఆస్ట్రేలియా రెండో T20 టీమ్ ఇదే..
ఇండియా: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్(c), ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్
ఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్, , మాథ్యూ వేడ్(w/c), జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘ, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్