109
ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. అందులో న్యూజిలాండ్, ఇంగ్లండ్, జట్లపై ఓడిన బంగ్లా.. ఒక్క ఆఫ్గనిస్తాన్‌పై విజయం సాధించింది. ఇక మరో కీలక పోరుకు బంగ్లా సిద్ధమవుతోంది.
అక్టోబర్ 19న పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్ టీం భారత్‌తో తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందుగా బంగ్లా జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (Bangladesh Captain Shakib Al Hasan) భారత్ మ్యాచ్ ఆడటం అనుమానంగా మారింది.
చెన్నెలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ పరుగు తీస్తుండగా గాయపడ్డాడు. దీంతో అతడికి చెన్నైలో స్కానింగ్ చేయించగా పెద్ద గాయమే అయినట్లు తేలింది. దీంతో షోయబ్ భారత్‌తో ఆడే మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.