ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో భారత్ (Bharath) ఒక టెస్ట్ మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. రాంచీ (Ranchi)లో ఇంగ్లాండ్ (England)తో జరిగిన నాలుగో టెస్టులో 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకొంది. 192 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ (55) , శుభ్‌మన్ గిల్ (52), ధ్రువ్ జురెల్ (39), యశస్వి (37) రాణించారు.
ఐదు టెస్టుల సిరీస్‌తో భారత్ రంగంలోకి దిగగా.. తొలుత ఫస్ట్ టెస్ట్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమికి కుంగిపోని టీమిండియా వరుస విజయాలతో హోరెత్తించింది.. విశాఖపట్నం (Visakhapatnam), రాజ్‌కోట్ (Rajkot) టెస్ట్ నుంచి తాజాగా రాంచీ టెస్టు వరకు తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకొంది. విరాట్ కోహ్లీ, మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్ లేకున్నా యువ ఆటగాళ్లు జట్టును విజయపథంలో నడిపించారు.
మరోవైపు ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ ఒక పరుగు సాధించి 600 పరుగుల మార్కును క్రియేట్ చేశారు.. దీంతో ఒకే టెస్ట్ సిరీస్‌లో 600+ పరుగులు చేసిన 5వ భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అదీగాక ఇప్పటి వరకు ఈ ఘనత సాధించిన విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, దిలీప్ సర్దేశాయ్ వంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ల సరసన చేరాడు.
ఇదిలా ఉండగా.. నాలుగో టెస్ట్, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 145 పరుగులే ఆలౌట్ అయింది. టీమిండియా స్పిన్నర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ వికెట్ల పతనం వేగంగా సాగింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లతో బ్యాటర్లను కట్టిపడేశాడు. కుల్‌దీప్ 4, జడేజా ఒక వికెట్ తీశారు. అన్ని వికెట్లు స్పిన్నర్లకే పడటం విశేషం. ఇంగ్లాండ్ బ్యాటర్లలో క్రాలే 60, బెయిర్ స్టో 30, మినహా అందరూ విఫలమయ్యారు. ఐదుగురు బ్యాటర్లు రెండంకెల స్కోరు చేయలేక పోయారు.