Telugu News » Jayalalitha: 28కిలోల నగలు వేలం.. రూ.100కోట్ల జరిమానా వసూల్.. !

Jayalalitha: 28కిలోల నగలు వేలం.. రూ.100కోట్ల జరిమానా వసూల్.. !

దివంగత ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha)కు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు 2014లో నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే.

by Mano
Jayalalitha: 28 kg jewelry auction.. Rs. 100 crore fine collected.. !

దివంగత ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha)కు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు 2014లో నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు నాలుగేళ్ల జైలు శిక్ష, 10 కోట్లు జరిమానా విధించింది బెంగళూరు కోర్టు (Bangalore Court).

Jayalalitha: 28 kg jewelry auction.. Rs. 100 crore fine collected.. !

ఈ తీర్పును సవాలు చేస్తూ నలుగురు కర్ణాటక హైకోర్టులో అప్పీల్‌ చేయగా అనుకూలంగా తీర్పు వచ్చింది. తర్వాత కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ సమయంలో 2016 డిసెంబరు 5న జయలలిత మరణించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించింది.

జయలలిత మరణించి ఆరేళ్లుకాగా ఆమె చెల్లించాల్సిన జరిమానా కట్టేందుకు ఎవరూ ముందుకురాలేదు. దీంతో ఆమె ఆస్తులు అమ్మి జరిమానా చెల్లించేందుకు చర్యలు చేపట్టారు. ఆమె ఇంట్లో అవినీతి నిరోధకశాఖ స్వాధీనం చేసుకున్న 28 కిలోల బంగారు, 800 కిలోల వెండి నగలు, ఇతర వజ్రాభరణాలను కోర్టులో అప్పగించారు.

అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. వాటిలో 7,040 గ్రాముల 468 రకాల బంగారు, వజ్రాభరణాలు, 700 కిలోల వెండి వస్తువులు, 740 ఖరీదైన చెప్పులు ఉన్నాయి. ఈ నగలను వేలం వేసి వచ్చిన నగదుతో జరిమానా చెల్లించాలని నిర్ణయించారు.

అందుకోసం నగలను మార్చి 6, 7న తమిళనాడు తీసుకొచ్చి హోంశాఖ కార్యదర్శికి అప్పగించనున్నారు. వాటికి ప్రస్తుత విలువ నిర్ణయించి వేలం వేయనున్నారు. ఈ నగలే రూ.40 కోట్ల వరకు ధర పలకనున్నాయి. మిగిలిన రూ.60 కోట్లకు స్థిరాస్తులను వేలం వేయడానికి చర్యలు చేపట్టారు. అక్రమంగా సంపాదించిన బంగారు, వజ్రాభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు ఇటీవల కర్ణాటకలోని బెంగళూరు కోర్టు తేదీని నిర్ణయించింది.

You may also like

Leave a Comment