పాకిస్థాన్(Pakistan) మరోసారి యూఎన్ వేదికగా భారత్(Bharat)ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ అయోధ్యలో రామ మందిరం, సీఏఏ గురించి వ్యాఖ్యలు చేశారు.
మునీర్ అక్రమ్ అయోధ్యలో రామ మందిర ప్రతిష్టతో పాటు పౌరసత్వ సవరణ చట్టం అమలు గురించి ప్రస్తావించారు. దీనికి ప్రతిగా భారత రాయబారి రుచిరా కాంబోజ్(Ruchira Kamboj) దీటుగా సమాధానమిచ్చారు. ‘నా దేశానికి సంబంధించిన విషయాలపై ఈ పాకిస్తాన్ పరిమిత, తప్పుదోవ పట్టించే దృక్పథాన్ని చూడటం నిజంగా దురదృష్టకరం’ అని అన్నారు.
పూర్తి భారత అంతర్గత విషయమైన దీనిపై పాకిస్తాన్ వ్యాఖ్యానించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ వ్యాఖ్యల్ని “విరిగిన రికార్డు”గా అభివర్ణించింది. శుక్రవారం జరిగిన సమావేశంలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ ‘ఇస్లామోఫోబియా’పై తీర్మానాన్ని ప్రకటించారు.
193 మంది సభ్యులతో కూడిన జనరల్ అసెంబ్లీ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. భారత్‌తో పాటు బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఉక్రెయిన్, యూకేతో సహా 115 దేశాలు అనుకూలంగా ఓటేయగా వ్యతిరేకంగా ఏ దేశం కూడా ఓటేయలేదు. 44 దేశాల ప్రతినిధులు గైర్హాజరయ్యారు.