ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War)తో గాజా నగరం చెల్లాచెదురైంది. పాలస్తీనియన్లు తినేందుకు తిండి, తాగేందుకు నీరు లేక సుమారు 23లక్షల మంది గాజావాసులు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనాకు (Palestine) మానవతా సహాయం (Humanitarianaid) అందించేందుకు భారత్ (India) సిద్ధమైంది. విపత్తు, సహాయ సామగ్రి, అత్యవసర ఔషధాలను గాజాకు పంపించింది.
ప్రాణాధార ఔషధాలు, సర్జికల్ వస్తువులు వంటి అత్యవసర వస్తువులతో కూడిన ఐఏఎఫ్ సీ-17 (IAF C-17) విమానం ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్ నుంచి ఈజిప్ట్‌ను ఈఐ-ఆరిశ్ ఎయిర్‌పోర్టుకు బయల్దేరింది. మానవతా సాయంలో భాగంగా వీటిని పంపిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టు చేశారు. భారత వైమానిక దళానికి చెందిన ఐఏఎఫ్ సీ-17 విమానంలో మొత్తం 6.5 టన్నుల సామగ్రి వెళ్తున్నదని చెప్పారు.
ఈ విమానం తొలుత ఈజిప్టులోని ఈఎల్-అరిష్ విమానాశ్రయానికి, అక్కడి నుంచి రఫా సరిహద్దు మీదుగా గాజాకు తీసుకెళ్తారని తెలిపారు. ఈ నెల 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్ హమాస్‌కు ప్రధాన కేంద్రంగా ఉన్న గాజాపై దాడి ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య యుద్ధం తీవ్రతరమైంది. దాడులు, ప్రతిదాడులతో ఇప్పటివరకు 4300 మంది పాలస్తీనియన్లు, సాధారణ పౌరులు మృతిచెందారు.
ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గాజాకు ఊరట కలిగించేందుకు ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు వారం రోజులకు పైగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గాజా వాసుల కోసం సహాయ సామగ్రిని తీసుకొచ్చిన ట్రక్కులను ఇజ్రాయెల్ అనుమతించింది. దాంతో యుద్ధం మొదలైన రెండు వారాల తర్వాత గాజా తలుపులు తెరుచుకున్నాయి. వందలాది ట్రక్కులు సహాయ సామగ్రితో వారం రోజులకుపైగా ఈజిప్టు సరిహద్దుల వద్ద వేచి చూస్తున్నాయి. అందులో 20 ట్రక్కులను ఇప్పుడు లోపలికి అనుమతించారు.
🇮🇳 sends Humanitarian aid to the people of 🇵🇸!
An IAF C-17 flight carrying nearly 6.5 tonnes of medical aid and 32 tonnes of disaster relief material for the people of Palestine departs for El-Arish airport in Egypt.
The material includes essential life-saving medicines,… pic.twitter.com/28XI6992Ph
— Arindam Bagchi (@MEAIndia) October 22, 2023