ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20(India Vs Australia 3rd T20)లో ఓటమిని చవి చూసిన టీమిండియా జట్టు.. తమ నాలుగో మ్యాచ్‌కు సూర్య కుమార్ సేన తీవ్ర కసరత్తులు చేస్తోంది. తన ఇన్నింగ్స్ విజయపథంలోకి నడిపించాడు. అయితే బ్యాటర్లను కట్టడి చేయలేక టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ తర్వాత టీమ్‌ఇండియాలో పలు మార్పులు జరగనున్నాయి.
శ్రేయస్ అయ్యర్‌కు స్థానాన్ని కల్పించేందుకు తెలుగు కుర్రాడు తిలక్ వర్మను పక్కన పెట్టాలని మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మూడో టీ20లో ధారాళంగా పరుగులిచ్చిన ఆవేశ్ ఖాన్, ప్రసిద్ధ కృష్ణ, ఇద్దరికీ రెస్ట్ ఇచ్చి వీరి స్థానంలో ముకేశ్ కుమార్, దీపక్ చాహర్‌ను ఆడించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆసిస్ జట్టులోనూ పలు మార్పులు జరిగాయి. భారీ స్కోర్ మ్యాక్స్‌వెల్ స్వదేశానికి వెళ్లాడు.
నాలుగో మ్యాచ్ రాయ్‌పూర్ వేదికగా డిసెంబర్ 1న జరగనుంది. ఈ మ్యాచ్ కోసం శ్రేయస్ అయ్యర్ తుది జట్టులోకి చేరనున్నాడు. అతడిని వైస్ కెప్టెన్‌గా నియమించనున్న సంగతి తెలిసిందే. అయితే శ్రేయస్ టాప్ఆర్డర్‌లో రావాలంటే ఎవరో ఒకరు తప్పుకోవాల్సిందే. కానీ రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ ఈ ముగ్గురిలో ఏ ఒక్కరిని తప్పించడానికి మేనేజ్‌మెంట్ కోరుకోవట్లేదు.
మూడో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 222 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. బరిలోకి దిగి ఛేదనను ప్రారంభించిన ఆసీస్ ఒత్తిడిలోకి వెళ్తున్న క్రమంలో ఆసిస్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ మన బౌలర్లను హడలెత్తించాడు. 48 బంతుల్లో 104 పరుగులతో రాణించాడు.